*ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 21వ తేదీ ఆదివారం నిర్వహించనున్న పోలియో దినం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన  నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ ఎమ్. శ్రీలక్ష్మి*

ఈ మేరకు కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ప్రతినిధులతో కలిసి కార్యక్రమం గోడపత్రికను బుధవారం ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఐదేళ్ల లోపు వయసు కలిగిన చిన్నారులందరికీ తప్పనిసరిగా ఆరోజు సమీప సచివాలయంలో పోలియో చుక్కలు వేయించాలని సూచించారు.

పోలియో మహమ్మారిని నిర్మూలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం పట్ల ప్రజలందరికీ అవగాహన కల్పించి చిన్నారులకు పోలియో చుక్కలు వేయించేలా తల్లిదండ్రులకు సమాచారం అందించాలని కమిషనర్ సూచించారు.

ఈ కార్యక్రమంలో డిఐఓ ఉమామహేశ్వరి, డాక్టర్ జిజియా, డీపీఎంఓ డాక్టర్ సునీల్, డిఎస్ఓ మల్లికార్జునరావు, అర్బన్ మెడికల్ ఆఫీసర్లు, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అశోక్, సిబ్బంది పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *