*ఆంధ్రప్రదేశ్ గతినే మార్చే అద్భుతమైన బడ్జెట్*
– వ్యసాయ రంగానికి పెద్ద పీట.
– గ్రామీణాభి అధిక ప్రాధాన్యత.
– తొలిసారిగా తెలుగు భాష పరిరక్షణకు బడ్జెట్ లో కేటాయింపులు.
.. ఈ సందర్భంగా అసెంబ్లీ లాబీలో నారా లోకేష్‌ను కలిసిన
– ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 2025 – 26
బడ్జెట్ లో అభివృద్ధి, సంక్షేమంతో పాటు హామీల అమలుకు అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు. వ్యవసాయ రంగాన్ని ఆడుకుంటాం అన్న ఎన్నికల నినాదాన్ని బడ్జెట్లో కేటాయింపుల ద్వారా ఆచరణలో అమలు చేసి చూపించారని ఆమె హర్షం వ్యక్తం చేశారు. రాష్ర్టాన్ని సస్యశ్యామలంగా మార్చేలా జలవనరుల శాఖకు అధిక కేటాయింపులు చేశారన్నారు.
బీసీల సంక్షేమానికి సబ్ ప్లాన్ తో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల అభివృద్ధికి బాటలు వేశారని ఆమె ప్రశంశించారు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌లో తొలిసారిగా తెలుగు భాషకు రాష్ట్ర ప్రభుత్వం 10 కోట్లు కేటాయించడం పై ఆమె ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అభినందించారు. విద్య, వైద్యం మరియ పారిశ్రామిక రంగాలకు పెద్ద పీట వేస్తూనే మరో వైపు పేదలు, మధ్య తరగతి వర్గాల ప్రజల సంక్షేమానికి బాటలు వేసి అన్ని వర్గాలకు సమన్యాయం చేసేన బడ్జెట్ అని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్ధిక, వ్యవసాయ శాఖ మంత్రులు పయ్యావుల కేశవ్, అచ్చెం నాయుడు గార్లను ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు అభినందించారు.
——————————————————————-
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 2025-26 బడ్జెట్ సమావేశాల సందర్బంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారితో కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి కొద్దిసేపు మాట్లాడారు. శుక్రవారం బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీకి వెళ్లిన ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి.. ఈ సందర్భంగా అసెంబ్లీ లాబీలో నారా లోకేష్‌ను కలిశారు. ఈ సందర్బంగా పలు అంశాలను మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లారు.