అసాంఘిక శక్తులకు హౌసింగ్ గృహాలు అడ్డాగా మారాయి

*అవినీతి ఫస్ట్ _అభివృద్ధి నెక్స్ట్* ఇది హౌసింగ్ అధికారులు తీరు. ముఖ్యమంత్రి ఆదేశాలు కూడా పాటించని నెల్లూరు జిల్లా అధికారులు
.. .. …. మిడతల రమేష్
*కేంద్ర ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కానివ్వం*.
అధికారుల నిర్వాహకం మూలంగా కూటమి సర్కార్కు చెడ్డ పేరు వస్తుంది
కంది కట్ల రాజేశ్వరి
*హౌసింగ్ అధికారుల తీరుపై బిజెపి నేతలు నిరసన*

కేంద్ర ప్రభుత్వం నెల్లూరు జిల్లాకు కేటాయించిన పిఎంఏవై గృహాలు 80 వేలకు పైగా ఉన్నాయి. వాటి నిర్మాణాలలో 50 వేల గృహాలు అసంపూర్ణంగా ఉన్నాయి.
తలుపులు ద్వారం బందనాలు పెట్టకుండానే కొంతమంది అధికారులు ఫైనల్ బిల్లు లు చేసి అవినీతికి పాల్పడ్డారు .
కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవినీతిపైవిజిలెన్స్ విచారణ కు ఆదేశించిన భౌతిక విచారణ మాత్రమే చేసి 110 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని విజిలెన్స్ నివేదిక సిద్ధం చేసింది .
వాస్తవానికి గృహానికి వాడిన స్టీలు సిమెంట్ ఫౌండేషన్ జోలికి వెళ్లకుండా విచారణ జరిపారు
రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసేందుకు కాంట్రాక్టర్లకు (పెద్ద మేస్త్రుల)కు ఎంత స్టీలు ఎంత సిమెంట్ ఇచ్చారు అనే నివేదిక సమర్పించమని జిల్లా అధికారులను కోరారు.
పలు జిల్లాలలో అధికారులు నివేదికల సమర్పించి నిధులు విడుదలు చేయించుకున్నారు

నెల్లూరు జిల్లాలో మాత్రం ప్రభుత్వానికి నివేదికలు పంపకుండా ఏమీ పట్టనట్లు అధికారులు వ్యవహరిస్తుండటంతో నెల్లూరు జిల్లాకు నిధులు విడుదల కావడం లేదు. ఈ నెలాకరుకు పి ఎం ఏ వై కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ కు కాల పరిమితి ముగుస్తుంది.
సంపూర్ణ నివేదికలు ఎండి కార్యాలయం సమర్పిస్తే జిల్లాలో అవినీతి పూర్తిగా బయట పడుతుందని అధికారులు పేదల ఇళ్లను నిర్లక్ష్యం చేశారు. హౌసింగ్ కాలనీలలో అసాంఘిక శక్తులు మద్యం సేవించడం వ్యభిచారం గంజాయి లాంటి మత్తు పదార్థాలు సేవించడం కు నిలయాలుగా మారాయని బిజెపి నేతలు ధ్వజమెత్తరు.
హౌసింగ్ అధికారులు అవినీతి కేంద్ర నిధుల దుర్వినియోగం పట్ల బీజేపీ నేతలు నిరసన తెలిపి
అనంతరం జిల్లా కలెక్టర్ కు హౌసింగ్ లో జరుగుతున్న అవకతవకలపై వివరించారు
ఈ కార్యక్రమంలో పొట్లూరు శ్రీనివాసులు .ప్రసాదు. రఘురామయ్య. పద్మ. సుజనా .నాగేంద్ర సింగ్. ఓజిలి సుధాకర్ నారాయణ యాదవ్ సుబ్బయ్య యాదవ్ కల్లు భాస్కర్ ముజీబ్ వెంకటేష్ ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed