*అవినీతిరహిత కోవూరుకు కట్టుబడి వున్నాం*
– మా మంచితనాన్ని అలుసుగా తీసుకోవద్దు
– వైసీపి నేతల తప్పుడు ప్రచారాలపై ఆగ్రహం.
– ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
కోవూరు నియోజకవర్గంలో దశల వారీగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు.డివైడర్ల మధ్య మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా బుచ్చిరెడ్డి పాళెం పట్టణానికి విచ్చేసిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారికి టిడిపి కూటమి పార్టీల నాయకులు బ్రహ్మరధం పట్టారు. సభా వేదిక వరకు గ్రీన్ కార్పెట్ పరిచి మార్గ మధ్యలో పూలు వెదజల్లుతూ అభిమానం చాటుకున్నారు. తేజూ డెవలపర్స్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన డివైడర్ మధ్య మొక్కల నాటే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు ఓ మొక్క నాటి లాంక్షనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ సామాజిక సేవ కోసం నిధులు వెచ్చిస్తున్న తేజూ డెవలపర్స్ ను ఆదర్శంగా తీసుకొని బుచ్చి పట్టణ అభివృద్ధిలో రియల్టర్లు భాగస్వాములు కావాలని కోరారు. ఎవరికి భయపడకుండా నిబంధనలకు అనుగుణంగా వ్యాపారాలు చేసుకోవాలని బుచ్చి ప్రాంత రియల్టర్లకు ఆమె సూచించారు. బుచ్చి పట్టణ వాసుల చిరకాల కలగా మిగిలిన మార్కెట్ నిర్మాణం తనకెంతో సంతోషాన్ని యిచ్చిందన్నారు. తన ఎన్నికల నినాదమైన అవినీతి రహిత, వివాద రహిత కోవూరు సాధనకు కట్టుబడి వున్నానన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు. లేని అవినీతిని భూతద్దంలో చూపించి విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని వైసిపి నేతలను హెచ్చరించారు. తమ మంచితనాన్ని అలుసుగా తీసుకోవద్దని హితవు పలికారు. కోవూరు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి చూస్తుంటే సంక్షేమం,అభివృద్ధి సమపాళ్లలో చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పాలనకు అద్దం పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బుచ్చి పట్టణ మున్సిపల్ ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజ, కమీషనర్ బాలకృష్ణ, ఎంపిడిఓ శ్రీహరి, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ వైస్ ఛైర్మన్లు యారటపల్లి శివకుమార్ రెడ్డి, నస్రీన్ ఖాన్, కౌన్సిలర్లు పుట్టా సుజాతమ్మ, తాళ్ల వైష్ణవి, రహమత్ బాషా, బెలూం మల్లారెడ్డి టిడిపి అర్బన్ మరియు రూరల్ మండల అధ్యక్షులు బత్తుల హరికృష్ణ, ఎంవి శేషయ్య, రాచూరు సత్యనారాయణ, టిడిపి నాయకులు మోర్ల మురళి, ఏటూరి శివరామకృష్ణారెడ్డి, వింజం రామానాయుడు, షేక్ పర్వీన్ తదితరులు పాల్గొన్నారు.