*అవినీతికి బ్రాండ్ అంబాసిడర్లుగా హౌసింగ్ అధికారులు*.
పేదల ఇళ్లలో కేంద్ర నిధులు ఎంతైనా దోచుకోవచ్చు.

పేదలఇల్లు నిర్మాణాలలో అవినీతి మూలంగా కేంద్ర నిధులు దుర్వినియోగం పై కేంద్ర సంస్థల దర్యాప్తుకు బిజెపి నేత మిడతల రమేష్ డిమాండ్ చేశారు.
అవినీతికి బ్రాండ్ అంబాసిడర్లుగా హౌసింగ్ అధికారులు వ్యవహరిస్తున్న తీరును నెల్లూరు డిఆర్ఓ ఉదయ భాస్కర్ కు బిజెపి నేత మిడతల రమేష్ తన వినతి పత్రంలో వివరించారు.
సిమెంట్ మాయం చేసి సస్పెన్షన్కు గురైన అధికారీ పై దర్యాప్తు జరగకుండానే ఎలా విధులలోకి తీసుకున్నారూ
. సంగం మండలంలో సిమెంట్ కుంభకోణాన్ని ఎదుర్కొంటున్న వ్యక్తి సీతారాంపురం మండలంలో మరో మారు సిమెంటు మాయం చేశారు. హౌసింగ్ అధికారులంటేనే అవినీతికి ప్రతిరూపంలా ఉంది.
నెల్లూరు జిల్లాలో అవినీతిపై విజిలెన్స్ దర్యాప్తు ఇప్పటివరకు పూర్తి కాలేదు.
విజిలెన్స్ దర్యాప్తు జరగకుండా రహస్య శక్తులు అడ్డుకుంటున్నాయి. హౌసింగ్ కార్పొరేషన్ హెడ్ ఆఫీస్ లో నెల్లూరు అవినీతిపై నివేదిక కోరితే ఆ అధికారుల ఆదేశాలను పట్టించుకునే వారు లేరు.
అవినీతిపై విజిలెన్స్ దర్యాప్తు పెండింగ్లో ఉన్న అధికారులకు నచ్చిన కాంట్రాక్టర్లకు మాత్రం నిధులు విడుదలకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఒక్క కాంట్రాక్టర్ ను మినహాయించి ఎవరికైనా నిధులు విడుదల చేయిస్తాం అంటున్నారు. .
కేంద్ర నిధులను ఎక్కువగా దోచుకున్న అధికారులకు పెద్ద స్థాయిలో అండదండలు దొరుకుతున్నాయి.
ప్రభుత్వాలు మారుతున్న అధికారులలో మార్పు రాలేదు. కేంద్ర నిధుల దుర్వినియోగంపై కేంద్ర సంస్థల దర్యాప్తు అధికారుల దృష్టికి హౌసింగ్ అవినీతిని తీసుకువెళ్లాలని డిఆర్ఓ రమేష్ విజ్ఞప్తి చేశారు. .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed