*అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం లోని తలుపుల గ్రామం లో…ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి* గారి మేనకోడలు…
ఇటీవల రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయ్యి తన *అవయవదానంతో 6 మందికి ప్రాణ దానం* చేసి మరణించిన *డాక్టర్ భూమిక* చిత్రపటానికి నివాళులర్పించిన..
*ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి*
—————————————-
👉 ఇటీవల హైదరాబాద్ నార్సింగ్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి యువ డాక్టర్ కుమారి భూమిక హాస్పిటల్ లో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ కి గురయ్యారు.
👉 MBBS చివరి సంవత్సరం లో భాగంగా హౌస్ సర్జన్ గా సేవలందిస్తున్న.. *డాక్టర్ భూమిక కు..మొదటి నుంచి సేవ భావం ఎక్కువ. చిన్నప్పటినుంచి చదువులో మంచి ప్రతిభ కనబరిచేది ..*
తల్లిదండ్రులకు ఏకైక కుమార్తె కావడంతో.. అల్లారుముద్దుగా పెరిగింది.
👉 భూమిక కు బ్రెయిన్ డెడ్ కావడంతో అపస్మారక స్థితిలో ఉన్న కన్న కూతురిని తిరిగి దక్కించుకోవడం సాధ్యం కాదు అని తెలిసి దుఃఖ సాగరంలో ఉన్న.. ఆమె తల్లిదండ్రులు.. మరియు ఎమ్మెల్సీ కల్పలత రెడ్డి గారు…. *డాక్టర్ భూమిక కు ఉన్న సేవా గుణం మరియు ఆశయాలను గుర్తుకు తెచ్చుకొని ..ఆమె గుండె, ఊపిరితిత్తులు,రెండు కిడ్నీలు,లివర్, కళ్ళ ను దానం చేసేందుకు ముందుకొచ్చారు.*
👉 *చనిపోతూ కూడా 6 మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ భూమిక.. ప్రజల మనసులు, గుండెల్లో సజీవంగా నిలబడిందని..చంద్రశేఖర్ రెడ్డి అభిప్రాయ పడ్డారు…*
👉 *ఒక్కోగానొక్క కూతురు మరణించే స్థితిలో ఉండడాన్ని చూస్తూ బరువెక్కిన హృదయంతో సైతం ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్న డాక్టర్ భూమిక కుటుంబ సభ్యుల నిర్ణయం సమాజానికి స్ఫూర్తి ని ఇస్తుంది…*
👉భూమిక మృతిని.. వారి కుటుంబ సభ్యులు ఎవ్వరు ఇప్పటికి జీర్ణించుకోలేకపోతున్నారు.
👉ఈ సందర్బంగా కృష్ణ గుంటూరు జిల్లాల *ఎమ్మెల్సీ కల్పలత రెడ్డి, ఉద్యోగ సంఘ నాయకులు కాకర్ల వెంకట్రాంరెడ్డి, ఉపాధ్యాయ సంఘ నాయకులు జాలి రెడ్డి, వెంకట నాధ్ రెడ్డి, అమరనాధ్ రెడ్డి, ప్రైవేట్ స్కూల్స్ నేతలు సుబ్బారెడ్డి, రామ్మోహన్ రెడ్డి గార్లతో కలిసి..డాక్టర్ భూమిక చిత్రపటానికి.. ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* గారు నివాళులర్పించారు.
*భూమిక కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు..వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు.. మనోధైర్యం కల్పించాలని చంద్రశేఖర్ రెడ్డి ప్రార్థించారు.*