అల్లూరు పోలేరమ్మను దర్శించుకున్న ఎంపీ వేమిరెడ్డి
నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గారు.. అల్లూరులో వెలిసిన శ్రీ పోలేరమ్మను దర్శించుకున్నారు.
బుధవారం సాయంత్రం ఆలయానికి చేరుకున్న ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు, సోదరులు వేమిరెడ్డి కోటారెడ్డి గారికి ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారికి దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతన సంవత్సరం సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.