అల్లూరు, జనవరి 7 :
*అల్లూరులో కన్నుల పండువగా శ్రీ పోలేరమ్మ తల్లి జాతర*
*🔶 అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్న రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి , నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , సర్వేపల్లి, కోవూరు ఎమ్మెల్యేలు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి , నెల్లూరు రూరల్ టిడిపి నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి , పలువురు ప్రముఖులు*
– 🔶 అతిథులకు ఘన స్వాగతం పలికిన కావలి శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు, బీద రవిచంద్ర గారు, ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు
*మంత్రి ఆనం రామనారాయణరెడ్డి గారి కామెంట్స్*
– 🔶 అల్లూరులో ఎంతో మహిమ గల తల్లి, శక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ తల్లిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతం, మహద్భాగ్యం : మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
– 🔶 రాష్ట్ర ప్రజలందరిపై, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పై, రాష్ట్ర ప్రభుత్వంపై ఆ పోలేరమ్మ తల్లి ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని అమ్మను వేడుకున్నాను : మంత్రి ఆనం
– 🔶 ఎటువంటి అరిష్టాలు లేకుండా రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు, సకల సౌభాగ్యాలతో వర్ధిల్లాలని, రాష్ట్ర సుభిక్షంగా ఉండాలని అత్యంత మహిమగల శ్రీ పోలేరమ్మ తల్లిని మనసారా ప్రార్ధించాను : మంత్రి ఆనం
……………………….
DIPRO, NELLORE