*అరాచక పాలన అంతం – అభివృద్ధి ప్రారంభం*

– పాటూరులో 65 లక్షలతో అభివృద్ధి పనులకు శ్రీకారం.
– ఎంపి వేమిరెడ్డి చొరవతో 76 లక్షల 32 వేల ఆర్ధిక ప్యాకేజీతో మిని చేనేత క్లస్టర్ సాధించాం.
– ప్రజాధనం దుర్వినియోగాన్ని సహించను.
– చికెన్ వేస్ట్ లారీ కనపడితే సీజ్ చేయండి.
– ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గార్ల సారధ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్టం అభివృద్ధి వైపు పయనిస్తుందన్నారు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు కోవూరు మండలం పాటూరు గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే ప్రశాంతి గారికి స్థానిక టిడిపి కూటమి నాయకుల ఘన స్వాగతం పలికారు. ముందుగా యామాలమ్మ ఆలయానికి వెళ్లి పూజలు చేసిన అనంతరం ఆమె 8 లక్షల 50 వేల వ్యయంతో నిర్మించిన రెండు సిసి రోడ్ల ప్రారంభోత్సవ శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం 23 లక్షల, 94 వేలు వెచ్చించి నిర్మించిన రైతు సేవా కేంద్రం, 20 లక్షల 50 వేలతో నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్ల ప్రారంభోత్సవాలతో పాటు 12 లక్షలతో మరో సిసి రోడ్డు నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారి రాకను పురస్కరించుకొని పాటూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభ విజయోత్సవ సభను తలపించింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గ పరిధిలో చేపల మేతగా వినియోగించేందుకు చికెన్ వేస్ట్ తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు మరియు రెవెన్యూ అధికారులను ఆదేశించారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేయాలని అధికారులు మరియు స్థానిక ప్రజా ప్రతినిధులకు దిశా నిర్దేశం చేశారు. గత ప్రభుత్వ హయాంలో 15 వ ఆర్ధిక సంఘ నిధులు పక్కదారి పట్టాయంటూ.. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పైసా ప్రజావసరాల వినోయోగించాలని కోరారు. గ్రామాలలో శానిటేషన్ పై దృష్టి సారించాలని సర్పంచులు మరియు పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. గ్రామాలలో మౌలిక వసతుల కల్పనకై కృషి చేయాలన్నారు. ముఖ్యమంత్రి పరిపాలనా దక్షత కారణంగా అప్పుల ఊబిలో వున్న ఆంధ్రప్రదేశ్ రాష్టాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెడుతోందని చంద్రబాబు నాయుడు గారిని ప్రశంసించారు. స్థానిక నాయకులు ప్రజలకు అందుబాటులో వుండి ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పధకాలపై అవగాహన కల్పించాలన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తామని ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చొరవతో 76 లక్షల 32 వేల ఆర్ధిక ప్యాకేజీతో మిని చేనేత క్లస్టర్ సాధించిన విషయాన్ని గుర్తు చేశారు, గుమ్మళ్ళదిబ్బ పాటూరు గ్రామాలలోని నేతన్నలకు చేనేత మిని క్లస్టర్ ద్వారా ఆర్ధిక ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పెన్నా డెల్టా ఛైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి, ఎంపిడిఓ శ్రీహరి రెడ్డి, తహసీల్దారు నిర్మలానంద బాబా, కోవూరు ఎంపిపి తుమ్మల పార్వతి, ఎంపిటిసి నాగరాజు, నీటి సంఘం అధ్యక్షులు ఆదాల శివారెడ్డి, టిడిపి మండల అధ్యక్షులు ఇంతా మల్లారెడ్డి, స్మాజీ ఎంపిపి యాకసిరి వెంకటరమణమ్మ, వేగూరు, సర్పంచ్ అమరావతి,మైనారిటి నాయకులు జమీర్, జహంగీర్, టిడిపి సీనియర్ నాయకులు రవీందర్ రెడ్డి, గాదిరాజు అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *