29 – 04 – 2025
అమరావతి రాజధాని ప్రపంచంలోనే తొలి సోలార్ నగరంగా చరిత్ర సృష్టించనుంది.
కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక, రాజధాని పనులు పరుగులు పెడుతున్నాయి.
ప్రజా రాజధాని పూర్తయితే యువతకు ఉద్యోగాలు ఉపాధి దొరుకుతాయి.
1631 రోజులపాటు నిర్ధామంగా రాజధాని రైతులు పోరాటాలు చేశారు.
న్యాయస్థానాల జోక్యంతో అమరావతి చెక్కుచెదరకుండా అలా నిలబడింది.
– షేక్. అబ్దుల్ అజీజ్, ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్.అమరావతి రాజధాని ప్రపంచంలోనే తొలి సోలార్ నగరంగా చరిత్ర సృష్టించనుంది.
కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక, రాజధాని పనులు పరుగులు పెడుతున్నాయి.
ప్రజా రాజధాని పూర్తయితే యువతకు ఉద్యోగాలు ఉపాధి దొరుకుతాయి.
1631 రోజులపాటు నిర్ధామంగా రాజధాని రైతులు పోరాటాలు చేశారు.
న్యాయస్థానాల జోక్యంతో అమరావతి చెక్కుచెదరకుండా అలా నిలబడింది.
– షేక్. అబ్దుల్ అజీజ్, ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్.
కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాజధాని పనులు పరుగులు పెడుతున్నాయని అమరావతి రాజధాని ప్రపంచంలోని తొలి సోలార్ నగరంగా చరిత్ర సృష్టించని ఉందని ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఓ ప్రకటన ద్వారా తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో విధ్వంసానికి గురైన అమరావతి రాజధాని అభివృద్ధిని తిరిగి పట్టాలు ఎక్కించేందుకు కూటమి ప్రభుత్వం అమరావతి 2.0 కు శ్రీకారం చుట్టిందని తెలిపారు. 65 వేల కోట్లతో 217 స్క్వేర్ కిలోమీటర్లతో 8352 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంలో రాజధాని అమరావతి రూపుదిద్దుకోబోతోందని అన్నారు. రాజధానిలో పున:నిర్మాణ పనులకు 48 వేల కోట్లు వ్యయంతో ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసిందని అన్నారు. ప్రజా రాజధాని అమరావతి పూర్తయితే 175 నియోజకవర్గాల యువతకు ఉద్యోగాలు ఉపాధి దొరుకుతాయి అని పేర్కొన్నారు. అమరావతి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నుండి ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రభుత్వాధినంలో ఉన్న భూమిని దశలవారీగా అమ్ముతూ రాజధాని నిర్మాణానికి చేసిన అప్పులను వడ్డీలతో సహా చెల్లించవచ్చు. తుళ్ళూరు అమరావతి తాడికొండ మంగళగిరి మండలాల పరిధిలోని మొత్తం 11 గ్రామాల్లో సుమారు 44 వేల ఎకరాల భూములను ఫేస్ టు భూ సమీకరణలో తీసుకోవాలనేది ఆలోచన అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల ప్రతిపాదన కారణంగా పెట్టుబడులు గణనీయంగా పడిపోయి రాష్ట్ర వ్యాప్తంగా భూముల విలువలు పడిపోయాయి అని అన్నారు. జగన్ రెడ్డి నిర్వాకం వల్ల రెండు లక్షల కోట్ల రూపాయల విలువైన 130 పరిశ్రమలు, ప్రఖ్యాత వ్యాపార, విద్యాసంస్థలు, పొరుగు రాష్ట్రాలకు తరలిపోయాయని. దీంతో లక్షలాదిమంది ఉద్యోగాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతి కి మద్దతు తెలిపి అధికారం వచ్చాక మూడు రాజధానుల పేరుతో కులచిచ్చు ప్రాంతీయ చిచ్చుపెట్టి కుంభకోణాల నుంచి ప్రజల దృష్టిని మళ్ళించారనీ మండిపడ్డారు. రాజధాని నిర్మాణం కోసం కాంట్రాక్టర్లకు ఇచ్చిన మెటీరియల్ కూడా వైసిపి ఎంపీ ఎమ్మెల్యేలు తమ అనుసరులతో కలిసి దోపిడీ చేశారని అన్నారు. 1631 రోజులపాటు నిర్విరామంగా రాజధాని రైతులు పోరాటాలు చేశారు ఈ సుదీర్ఘ పోరాటంలో 200 మందికి పైగా రైతులు వేధింపులు తల లేక ప్రాణాలు వదిలారు. రైతుల ప్రాణ త్యాగాలు ఓవైపు పోరాటాలు మరోవైపు న్యాయస్థానాల చర్చింతు రాజధాని అమరావతి చెక్కుచెదరకుండా అలా నిలబడింది. చంద్రబాబు పరిపాలన దక్షిణతో ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకులను ఒప్పించి తెచ్చిన నిధులతో అమరావతి రానున్న రోజుల్లో పరుగులు పెట్టనుంది.