*అమరావతి పై విషం చిమ్ముతున్నారు .-జగన్ పై మంత్రి నారాయణ ఫైర్*

నెల్లూరు నగరంలోని 53, 54వ డివిజన్లలో మంత్రి నారాయణ పర్యటించారు..అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ నేతలు అమరావతిపై విషం కక్కుతున్నారని మండిపడ్డారు..

గతంలో అసెంబ్లీ సాక్షిగా రాజధానికి 30 వేల ఎకరాలు అవసరమని చెప్పిన జగన్, అధికారంలోకి రాగానే మాట తప్పి ‘మూడు ముక్కలాట’ ఆడారని, భూములిచ్చిన రైతులను కంచెలేసి బంధించి మహిళలపై బూటు కాళ్లతో దౌర్జన్యం చేయించారని ధ్వజమెత్తారు.

ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కేంద్రం సహకారంతో వరల్డ్ బ్యాంక్ & ADB (15,000 కోట్లు), హడ్కో (11,000 కోట్లు), నాబార్డు (7,500 కోట్లు) నిధులు సమకూర్చుకుని రాజధాని నిర్మాణాన్ని శరవేగంగా చేపడుతుంటే, అది చూసి ఓర్వలేక జగన్, బొత్స, సజ్జల వంటి నేతలు పరస్పర విరుద్ధమైన స్టేట్మెంట్లు ఇస్తున్నారని విమర్శించారు. జగన్ అమరావతిపై తన స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ, ప్రజలను గందరగోళానికి గురిచేయడం మానుకోకపోతే వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఆ 11 సీట్లు కూడా రావని ఘాటుగా హెచ్చరించారు.

 

: బిగ్ బ్రేకింగ్

నెల్లూరు

వైఎస్సార్సీపీ పై మంత్రి నారాయణ హాట్ కామెంట్స్

జగన్ అమరావతిపై విషం కక్కుతున్నారు

అందు ఈరోజు ఆ పార్టీ నేతల చేసిన వాఖ్యలే నిదర్శనం

2014 లో అసెంబ్లీ సాక్షిగా అమరావతికి 30 వేల ఎకరాలు అవసరమని ప్రకటించారు

అధికారంలోకి రాగానే మాటమార్చి మూడుముక్కలాట ఆడారు

58 రోజుల్లో 34 ,400 ఎకరాలిచ్చిన భూములిచ్చిన రైతులను కంచెలేసి బంధించారు

ఆడవాళ్ళని బూటు కాళ్లతో తన్నించారు

అక్రమ కేసులు బనాయించారు

మాటమీద నిలబడే తత్త్వం మాది కాదని నిరూపించుకొన్నారు

ఇప్పుడు రాజధాని నిర్మాణపనులు శరవేగంగా సాగుతుంటే జీర్ణించుకోలేకున్నారు

అందరూ అమరావతి అభివృద్ధిని కాంక్షిస్తున్నారు

ప్రపంచంలో టాప్ 5 రాజధానుల్లో ఒకటిగా నిలబెట్టేందుకు శ్రమిస్తున్నాము

దాన్ని చూసి ఓర్వలేక విషం కక్కుతున్నారు

ఖజానా ఖాళీ చేసాము రాజధాని కట్టలేరని జగన్ విభావించాడు

కేంద్రప్రభుత్వ సహాయంతో అమరావతి నిర్మాణం జరుగుతోంది

11 వేల కోట్లు హడ్కో లోన్ ఇచ్చింది

15 వేల కోట్లు వరల్డ్ బ్యాంక్ ,ఈడీపీ ఇచ్చాయి

నాబార్డు 7500 కోట్లు ఇచ్చింది

పనులు చూసి తట్టుకోలేక ఇష్టానుసారం స్టేట్ మెంట్లు ఇస్తున్నారు

జగన్ ,ధర్మాన ,బొత్స ,సజ్జల మాటల్లో పొంతనే లేదు

అమరావతి పై తీర్మానం చేసి కేంద్రానికి పంపటం వాళ్ళకి నచ్చటం లేదు

శాడిజం ప్రదర్శిస్తున్నారు

ప్రజలని గందరగోళానికి గురిచేయాలన్నదే వైఎస్సార్సీపీ లక్ష్యం

అమరావతి రాజధానిపై జగన్ స్పష్టత ఇవ్వాలి

పార్టీ నాయకుడిగా క్లారిటీ ఇవ్వాలి

అవసరమా లెదా అని ప్రజలు నిర్ణయిస్తారు

తీరు మార్చుకోకుంటే పదకొండు సీట్లు కూడా మీ పార్టీకీ రావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed