
*SPS నెల్లూరు జిల్లా,*
*“అమరజీవి” గారికి ఘనంగా శ్రద్దాంజలి ఘటించిన జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల,IPS.,*
జిల్లా పోలీసు కార్యాలయం నందు శ్రీ పొట్టిశ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించి, వారి స్మృతులు, సేవలను ఉద్భోధించిన జిల్లా యస్.పి. గారు.
దృడ సంకల్పం ఉన్న గొప్ప వ్యక్తి. ప్రేమ, వినయం, సేవ, నిస్వార్ధతలు మూర్తీభవించిన స్వరూపమే పొట్టిశ్రీరాములు గారు.
ఇలాంటి దృడ సంకల్పం ఉన్న గొప్ప వ్యక్తి జన్మించిన స్థలంలో మనందరం విధులు నిర్వహించడం సంతోషంగా ఉంది.
స్వాతంత్ర్యం అనంతరం ప్రత్యేక రాష్ట్రము అనే కఠోర నిర్ణయం, ఆశయసాధన కొరకు నిరాకంటంగా దీక్ష చేసిన మహనీయుడు అమరజీవి గారు..
తెలుగు మాట్లాడే ప్రజలకు ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి, తనను తాను బలిదానం చేసుకున్న గొప్ప త్యాగమూర్తి.
అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు చేసిన కృషి, దీక్ష ఫలితమే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది
శ్రీ పొట్టిశ్రీరాములు గారి త్యాగం తెలుగు ప్రజల గుండెల్లో పదిలంగా ఉంటుంది.
అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయం..
ఈ కార్యక్రమంలో జిల్లా యస్.పి. గారితో పాటు SB DSP శ్రీ శ్రీనివాసరావు గారు, AO శ్రీ చంద్రమౌళి గారు, వెల్ఫేర్ RI శ్రీ రాజారావు గారు, ఇతర పోలీసు అధికారులు, DPO, ఇతర సిబ్బంది పూలమాల వేసి ఘననివాళులు అర్పించారు.
జిల్లా పోలీసు కార్యాలయం,తేది.15.12.2025.