*అభివృద్ధి సంక్షేమాలే టిడిపి అజెండా*

– సూపర్ సిక్స్ దశల వారీగా అమలు చేస్తాం.

– అభివృద్ధి పనులలో నాణ్యతా ప్రమాణాలు పాటించండి.
– బిపిసిఎల్ రిఫైనరీ నిర్మాణం నిరుద్యోగ సమస్యకు పరిష్కారం.
– ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్టం అభివృద్ధి దిశగా పురోగమిస్తుందన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు. కోవూరు మండలం పోతిరెడ్డి పాళెం పంచాయతి పరిధిలోని సాలుచింతల సెంటర్ మసీదు వీధిలో 8 లక్షల 50 వేల వ్యయంతో నిర్మిస్తున్న సిమెంట్ రోడ్డును ఆమె శంఖుస్థాపన చేశారు. అనంతరం వివిధ సమస్యలపై స్థానికుల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు మాట్లాడుతూ
ప్రజా సంక్షేమం సంక్షేమమే లక్ష్యంగా విన్నూత్న పథకాలకు శ్రీకారం చుడుతున్న డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ గార్లకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలకు ఆటకం రాకుండా సంక్షేమ పధకాలు అమలు చేసే సామర్ధ్యం చంద్రబాబు నాయుడు గారికే వుందన్నారు. అప్పుల భారంతో అస్తవ్యస్తమైన రాష్ట ఆర్ధిక పరిస్థితి యిప్పుడిప్పుడే గాడిన పడుతుందన్నారు. గత ఐదేళ్లలో తట్టెడు మట్టికి కూడా నోచుకోని గుంతల రోడ్ల దుస్థితి సంక్రాంతి నాటికి మెరుగవుతుందన్నారు.
12 కోట్ల 50 లక్షలు వెచ్చించి నియోజకవర్గ వ్యాప్తంగా చేపట్టే అభివృద్ధి పనుల నిర్మాణ కార్యకలాపాలలో టిడిపి నాయకులు, కార్యకర్తలు భాగస్వాములు కావాలని కోరారు. గ్రామాలలో జరిగే అభివృద్ధి పనులను పార్టీ క్యాడర్ పర్వేక్షిస్తూ మీ గ్రామాలను అభివృద్ధి చేసుకునే బాధ్యత మీదేనని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు పిలుపునిచ్చారు. అభివృద్ధి పనులలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కోరారు. నెల్లూరు జిల్లాకు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ రిఫైనరీ రాకతో వేల సంఖ్యలో యువతకు ఉపాధి దొరుకుతుందన్నారు. బిపిసిఎల్ లాంటి భారీ పరిశ్రమ నెల్లూరు జిలాకు వచ్చేందుకు సహకరించిన ముఖమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్, ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గార్లకు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు కృతజ్ఞతలు తెలియ చేశారు.
ఈ కార్యక్రమంలో పెన్నా డెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి, పోతిరెడ్డి పాళెం సర్పంచ్ నలుబోలు శ్రీవాణి, ఎంపిపి తుమ్మల పార్వతి, జెడ్పిటిసి కవరగిరి శ్రీలత, మండల టిడిపి అధ్యక్షులు ఇంతా మల్లారెడ్డి, సీనియర్ నాయకులు అశోక్ రెడ్డి, శివారెడ్డి, లక్ష్మి నరసారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *