*అభివృద్ధి కి కేర్ ఆఫ్ అడ్రస్ గా కోవూరు*
– ప్రశాంతి రెడ్డి గారి పాలనలో ప్రజలు సంతోషంగా వున్నారు.
– అవినీతిపరుల కొమ్ము కాస్తారా…?
– మాజీ అయ్యాక ప్రసన్నకు మతి భ్రమించింది.
– నీ ఉడత ఊపులకు మేం భయపడం ప్రసన్నా..
– అద్ధికారులను దుర్భాషలాడడం సంస్కారమా ప్రసన్నా..
– కొడవలూరు లో ప్రసన్న, కాకాణిలపై ధ్వజమెత్తిన కోవూరు టిడిపి నేతలు
ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు ఒకే అంటే మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి సైతం పచ్చ కండువా కప్పుకునేందుకు రెడీగా వున్నారన్నారు టిడిపి నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి గారు. ఏ మాట్లాడాలో తెలియని కన్ఫ్యూజన్ లో కోవూరు నియోజకవర్గాన్ని ఉద్దేశించి అవినీతి రహిత అనబోయి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అవినీతి అనేశారన్నారు. మంత్రిగా వున్నప్పుడు నియోజకవర్గంలో అడుగు పెట్టనీయని ప్రసన్న తరుపున మాజీ మంత్రి కాకాణి వకాల్తా పుచ్చుకోవడం విడ్డూరంగా వుందన్నారు. దాదాపు 8 వేల మందికి ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు 100 మందికి పైగా దివ్యాన్గులకు ఉచితంగా ఎలక్ట్రిక్ ట్రై సైకిళ్ళు యిచ్చిన ప్రశాంతి రెడ్డి గారి పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు.
అనంతరం టిడిపి నాయకులు బెజవాడ వంశీ కృష్ణా రెడ్డి గారు మాట్లాడుతూ ప్రసన్న పాలనలో అవినీతిలో టాప్ రేటింగ్లో వున్న కోవూరు నియోజకవర్గం వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యాక అవినీతి రహితంగా మారిందన్నారు. మాజీ ఎమ్మెల్యే ప్రసన్న చెబుతున్న మాటలు వింటుంటే తన హయాంలో జరిగిన అవినీతి గురించి తానే చెబుతున్నట్టు వుందన్నారు. 151 నుంచి 11 స్థానాలకు దిగజారిన టిడిపి వైసిపి నాయకులకు ఇంకా బుద్ధి రాలేదన్నారు. విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు సాగునీటి కాలువలలో పూడికలు తీయించక పోయి ఉంటే ఇటీవల పడ్డ భారీ వర్షాలకు తమ పంట పొలాలు నీట మునిగేవి అన్న వైసిపి సర్పంచులు విడవలూరు మండల సమావేశంలో అన్న మాటలను గుర్తు చేశారు.
వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యాక కోవూరు నియోజకవర్గంలో ప్రజా పాలన కొనసాగుతుందన్నారు. రెండు సార్లు జాబ్ మేళా నిర్వహించి దాదాపు 3 వేల మందికి ఉపాధి కల్పిస్తూ ప్రజాసేవకు మారుపేరుగా వున్న ప్రశాంతి రెడ్డి గారి పాలనలో కోవూరు ప్రశాంతంగా ఉందన్నారు వంశీ కృష్ణా రెడ్డి గారు. 2019 లో evm ట్యాపరింగ్ కారణంగా ప్రసన్నకు నలభై వేల మెజారిటీ వచ్చిందన్నారు. కేవలం 60 రోజులలో 1 లక్ష మంది టిడిపి సభ్యత్వాలు తీసుకున్నారంటే ప్రసన్న చరిత్ర ముగిసినట్టేనన్నారు. ప్రసన్న సంస్కార రహితంగా మాట్లాడుతున్నారని వంశీ కృష్ణారెడ్డి ధ్వజమెత్తారు.
నిజాలు తెలుసుకొని మాట్లాడాలని మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్లకు సూచించారు టిడిపి సీనియర్ నాయకులు కరకట్ట మల్లికార్జున గారు. గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో టిడిపి అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి కూడా భయపడే పరిస్థితిని ఆయన గుర్తు చేశారు. మూడేళ్ళ క్రితం ఎంపిటిసి ఎన్నికలలో ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన అరాచకాలు ప్రజలు మరిచిపోలేదన్నారు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని లేకుంటే ప్రజలు చెప్పులతో తరిమి తరిమి కొడతారన్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని అధికారులను దుర్భాషలాడడం మానుకోవాలన్నారు.
మండాలనికో షాడోను పెట్టి అక్రమాలకు పాల్పడ్డ ప్రసన్నకు మాట్లాడే అర్హత లేదన్నారు టిడిపి నాయకులు నాపా వెంకటేశ్వర్లు నాయుడు గారు. అవినీతి పరులను కొమ్ముకాసే ప్రసన్న తీరు మార్చుకోవాలని సూచించారు.
కోవూరు టిడిపి అధ్యక్షులు మల్లారెడ్డి మాట్లాడుతూ 16 నెలలు జైల్లో గడిపిన దొంగ నాయకత్వంలోని నాయకులందురు దొంగలేనన్నారు. మాజీ మంత్రి కాకాణిని ఉద్దేశించి కోర్టులో ఫైళ్ల దొంగన్నారు. వైసిపి పాలనలో గ్రావెల్ దొంగలు, గంజాయి దొంగలు ఏకంగా అసాంఘిక శక్తులు రాజ్యమేలాయన్నారు. నిజాయతి పరులైన అధికారులు, నాయకుల పై నోరు పారేసుకుంటే భారీ మూల్యం చెల్లించు కోవాల్సివస్తుందని హెచ్చరించారు. కారుకూతలు కూస్తే ప్రజలు చెప్పులతో కొడతారన్నారు.
చివరిగా టిడిపి నాయకులు వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గాన్ని అవినీతిరహిత, క్యాన్సర్ రహితంగా మారుస్తూ ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి గారి ప్రజాహిత కార్యక్రమాలు చూసి ఓర్వలేక ప్రసన్న కుమార్ రెడ్డి నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు.