*అభివృద్ధి కావాలా..? అరాచకం కావాలా..? నిర్ణయం మీదే — ప్రజలకు ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల విజ్ఞప్తి*

*అట్టహాసంగా ప్రారంభమైన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎన్నికల ప్రచార ర్యాలీ*

*భారీగా తరలివచ్చిన వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు, ప్రజలు మహిళలు*

*రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎన్నికల రోడ్ షోలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి*

*రెండు చేతులు జోడించి ప్రజలకు అభివాదం చేస్తూ ప్రచార ర్యాలీని కొనసాగించిన ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి గార్లు*

*డైకాస్ రోడ్ సెంటర్ నుండి అట్టహాసంగా ప్రారంభమైన ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డిగార్ల ఎన్నికల రోడ్ షో*

*జనసంద్రంగా మారిన పొదలకూరు రోడ్డు రహదారి*

*అభిమాన నాయకులు మద్దతు తెలిపేందుకు దారి పొడవునా భారీగా బారులుతీరిన ప్రజలు*

*ఇళ్లపై నుండి, దారి పొడవునా ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి మా మద్దత్తు వైఎస్ఆర్ సీపీకే అంటూ రెండు చేతులు ఊపి సంఘీభావం తెలిపారు*

*అడుగడుగునా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డికి బ్రహ్మరథం పట్టిన ప్రజలు*

*మంగళహారతులు పట్టి గుమ్మడికాయలతో దిష్టి తీసి అడుగడుగునా పూల వర్షం కురిపించి అభిమాన నాయకులు ఆదాల ప్రభాకర్ రెడ్డి, విజయసాయిరెడ్డి గార్లపై అభిమానం చాటుకున్న ప్రజలు*

*ఎన్నికల ప్రచార ర్యాలీకి అశేషంగా తరలివచ్చిన ప్రజలకు, వైసీపీ శ్రేణులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన రూరల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి*

*డైకాస్ రోడ్ సెంటర్ నుండి నిప్పో సెంటర్, వాటర్ ట్యాంక్, పద్మావతి సెంటర్, సారాయిఅంగడి సెంటర్, పొదలకూరు సెంటర్, ఎస్పీ బంగ్లా, కలెక్టర్ బంగ్లా, డీకే డబ్ల్యూ కాలేజ్ రహదారి మీదుగా బట్వాడిపాళ్లెం వరకు జై జగన్, జై జై జగన్, జై హో అదాల, జయహో విజయసాయి రెడ్డి, జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఫ్యాను గుర్తుకే మన ఓటు, హోరెత్తిన నినాదాల నడుమ కొనసాగిన భారీ ఎన్నికల రోడ్ షో ర్యాలీ*

నెల్లూరు రూరల్ ప్రజలకు అభివృద్ధి కావాలో…? అరాచకాలు కావాలో… నిర్ణయం మీదేనంటూ రూరల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. నెల్లూరు పార్లమెంట్ సభ్యులుగా పార్టీ అధిష్టానం ఎంతో నమ్మకంతో అత్యున్నతమైన పదవులు అందిస్తే ఆ పదవుల ద్వారా అధికారాన్ని అనుభవించి కేవలం ఒక సామాన్యమైన ముస్లిం కుటుంబానికి చెందిన వ్యక్తికి అసెంబ్లీ టికెట్ ఇచ్చారని దుర్బుద్ధితో పార్టీకి ద్రోహం చేసిన వ్యక్తులు కావాలో…? పార్టీ కోసం మొదటినుండి ఎంతో నమ్మకం విశ్వాసంగా ఉంటూ పార్టీ అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన విశ్వాస పాత్రులు, అత్యంత నమ్మకస్తులు కావాలో…? ప్రజలు ఒక్కసారి ఆలోచించి 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ఓటు వేసి మంచివారికి మద్దత్తు ఇవ్వాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి కోరారు. ఈ మేరకు శనివారం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని డైకాస్ రోడ్ సెంటర్ నుండి నిప్పోసెంటర్, పద్మావతి సెంటర్, సారాయి అంగడి సెంటర్, పొదలకూరు రోడ్ సర్కిల్, డీకే డబ్ల్యూ కాలేజీ సర్కిల్ మీదుగా బట్వాడపాలెం వరకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి, నెల్లూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి, విజయ సాయి రెడ్డి గార్లు సంయుక్తంగా ఎన్నికల ప్రచార రోడ్ షో ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ పోట్లూరు స్రవంతి, విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు వైవి రామిరెడ్డి, మలిరెడ్డి కోటారెడ్డి, మాలెం సుధీర్ కుమార్ రెడ్డి, సిహెచ్ హరిబాబు యాదవ్, లంక రామ శివారెడ్డి, మంగళ పూడి శ్రీకాంత్ రెడ్డి, కార్పొరేటర్లు, డివిజన్ ఇంచార్జీలు, వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed