*అభివృద్ధిని చూసి ఓర్వలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనవసర విమర్శలు చేస్తున్నారు : వాకాటి నారాయణ రెడ్డి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ*
ఈరోజు కూటమి ప్రభుత్వం మోడీ గారి సారధ్యంలో చంద్రబాబు సీఎంగా ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నారు.7 నెలలు కాలం ఇటువంటి సూపర్ సిక్స్ హామీలు నిధులు కొరత ఉన్న మోడీ గారి అండతో NDA ప్రభుత్వం ముందుకు వెళ్తుంది.
ఇవాళ చూస్తుంటే పోలవరం కట్టే విషయం నిధులు ఇవ్వడం కానీ, అమరావతి నిర్మాణం గానీ, నిధులు ఇచ్చి ముందుకు పోవాలని సంకల్పంతో తోటి సీఎం ఆశయాలను నెరవేర్చడానికి ఎవరైతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన కృషి చేస్తూ రాష్ట్రానికి అభివృద్ధి చేస్తూ, సంక్షేమానికి ముందు తీసుకుపోతున్న కూటమి ప్రభుత్వం.
సూపర్ సిక్స్ లో పెన్షన్ 4000, అక్కాచెల్లెళ్లకు ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇవ్వడం, ఉగాదికి మహిళలకు ఆర్టీసీ లో ఉచిత ప్రయాణం. మిగతా నాలుగు హామీలు కూడా తొందరగా శ్రీకారం చుడతారు.
ఈ అభివృద్ధిని చూసి ఓర్వలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనవసర విమర్శలు చేస్తున్నారని వాకాటి నారాయణరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు