*అబ్దుల్ అజీజ్ ఆత్మీయ సన్మాన సభను విజయవంతం చేయండి*
.. *బెజవాడ గోపాల్ రెడ్డి విగ్రహం దగ్గర నుంచి ర్యాలీ*
*నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి*
*. పెద్ద ఎత్తున సన్మాన సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు*
*తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు, వక్ఫ్ బోర్డు అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ఆత్మీయ సన్మాన సభను ఈనెల 5వ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహిస్తున్నామని దీనిని విజయవంతం చేయాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పిలుపునిచ్చారు. నెల్లూరు నగరంలోని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో గురువారం అబ్దుల్ అజీజ్ ఆత్మీయ సన్మాన సభకు సంబంధించి టిడిపి ముఖ్య నేతలు, డివిజన్ ఇన్చార్జిలు, అధ్యక్షులతో సమావేశాన్ని నిర్వహించారు.*
*ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక బెజవాడ గోపాల్ రెడ్డి విగ్రహం దగ్గర నుంచి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం వరకు పెద్ద ఎత్తున ర్యాలీని నిర్వహిస్తున్నామని ఈ ర్యాలీలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని సూచించారు. ప్రతి డివిజన్ నుంచి టిడిపి నేతలు కార్యకర్తలు అందరూ అబ్దుల్ అజీజ్ సన్మాన సభలో పాల్గొవాలని కోరారు.*
*ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, టిడిపి రాష్ట్ర కార్యదర్శి రాజా నాయుడు, జన్నీ రమణయ్య పలువురు క్లస్టర్ ఇంచార్జిలు , పలువురు కార్పొరేటర్లు టిడిపి నేతలు పాల్గొన్నారు*