అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం.
పలు అంశాల పై వాడీ వేడి చర్చ
… ఒకరి నియోజకవర్గంలో మరొకరు జోక్యం తగదని పేర్కొన్న పలువురు
నెల్లూరు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన జిల్లా తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. జిల్లా పార్టీ నూతన కార్యాలయం కొరకు స్థల సేకరణ, నిర్మాణం, జిల్లాలో చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాలు, పిఏసిఎస్ త్రిసభ్య, ఏఎంసీ, దేవాలయాలు మరియు జిల్లాలో ఉన్న ఇతర నామినేటెడ్ పదవుల నియామకం, అధ్యక్షుల వారి అనుమతి తో మరికొన్ని అంశాలు అజెండా గా సమావేశం సాగింది.
ఈ కార్యక్రమంలో మంత్రులు ఎంఎండీ ఫరూక్, ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ, పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, కావ్య కృష్ణారెడ్డి, కాకర్ల సురేష్, ఇంటూరి నాగేశ్వరరావు, బీద రవిచంద్ర యాదవ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి లు పాల్గొన్నారు.