*అప్పుడు గుర్తుకు రాని బీసీలు ఇప్పుడు గుర్తుకు వచ్చారా*
*బీసీలా ఘాతకుడు కాకాణి గోవర్ధన్ రెడ్డే*
*నీ అనుచరుడు మందల వెంకట శేషయ్య పై ఒక బీసీ మహిళ కేసు పెట్టేసరికి బీసీలు గుర్తుకొచ్చారా*
*నీ అనుచరుడు మందల వెంకట శేషయ్య తప్పు చేశాడు కాబట్టే జైలుకు వెళ్లాడు*
*రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మొదలైన ఏ కులాన్ని నువ్వు విడిచి పెట్టావు*
*ఐదేళ్ల వైసీపీ పాలనలో అక్రమ కేసులు, దాడులు, ఆస్తుల విధ్వంసమే కదా నువ్వు చేసింది*
*వెంకటాచలంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ మండల అధ్యక్షులు గుమ్మడి రాజా యాదవ్*
నీ అనుచరుడు వెంకట శేషయ్య తప్పు చేస్తేనే పోలీసులు చర్యలు తీసుకున్నారు.. అందులో పోలీసుల తప్పేముంది
అనికేపల్లి వైసీపీ నేత కోడూరు ప్రదీప్ కుమార్ రెడ్డి చెప్పాడని నాపై 20కి పైగా అక్రమ కేసులు బనాయించి రౌడీషీట్ పెట్టించావు
సర్వేపల్లి రిజర్వాయర్ లో స్థానిక వైసీపీ నేతలతో కలిసి నీ అక్రమ గ్రావెల్ తవ్వకాలను అడ్డుకున్న నాతోపాటు స్వర్గీయ నలగట్ల సుబ్రహ్మణ్యం, మందల పవన్ కుమార్, రవి నాయుడు పై రేప్ కేసుతోపాటు రెండు అట్రాసిటీ కేసులు పెట్టించలేదా
నీ అక్రమ గ్రావెల్ తవ్వకాలను అడ్డుకోవడమేనా మేము చేసిన తప్పు… మేం బీసీలం కాబట్టే మాపై అక్రమ కేసులు బనయించావు
వెంకటాచలంలో బీసీ నేత రాజేంద్ర పై హత్యాయత్నం కేసు బనాయించి 50 రోజులకు పైగా జైల్లో పెట్టించావు
వెంకటాచలానికి చెందిన మరో బీసీ నేత రమేష్ పై తప్పుడు కేసులు బనాయించి రౌడీషీట్ పెట్టించలేదా
మనుబోలు మండలం వీరంపల్లిలో బీసీలపై అక్రమ కేసులు పెట్టించి జైలుకు పంపించలేదా
పొదలకూరులో ఒక బీసీ నేత పై అక్రమ కేసు పెట్టించావు.. ఆ నేత భార్య నిండు గర్భిణి అని తెలిసిన ఆ బీసీ నేతను జైలుకు పంపించావు
టీపీగూడూరులో గంగాధర్ యాదవ్ 16 ఎకరాల రొయ్యల గుంటలను తెగ్గొట్టి ఆర్థిక నష్టం కల్పించావు
వెంకటాచలం మండలంలో కుంకాల దశరథ నాగేంద్రప్రసాద్ సెల్ ఫోన్ టవర్ కూల్చి, వేబ్రిడ్జ్ ధ్వంసం చేసి కోటి రూపాయలకు పైగా ఆస్తి నష్టం కలిగించలేదా
వెంకటాచలం మండలం నిడిగుంటపాలెంలో బిజెపి మండల అధ్యక్షులు కుంచె శ్రీనివాసులు యాదవ్ పై అక్రమ కేసులు బనాయించడంతోపాటు రొయ్యల గుంటలను ధ్వంసం చేసి ఆర్థికంగా ఇబ్బంది పెట్టలేదా
వెంకటాచలం మండలం జంగాలపల్లిలో గుమ్మా రాజగోపాల్, చెముడుగుంటలో దొడ్ల అశోక్, వెంకటాచలంలో సండి రమణయ్య, ఎర్రగుంటలో వలిపి వెంకటేష్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతమంది బీసీ నేతలపై అక్రమ కేసులు బనాయించడంతోపాటు ఆర్థికంగా ఇబ్బంది పెట్టలేదా
ఒక బీసీలనే కాదు.. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు మొదలైన ఏ ఒక కులాన్ని నువ్వు విడిచి పెట్టలేదు
వీళ్లందరి ఆత్మఘోష నీకు తగిలే నువ్వు మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయావు
చివరికి ముత్తుకూరులో బీసీ కులానికి చెందిన ప్రముఖ చానల్ రిపోర్టర్ పై కూడా అక్రమ కేసులు పెట్టించి మరి జైలుకు పంపించావు
వెంకటాచలంలో మైనార్టీ వర్గానికి చెందిన ప్రముఖ దినపత్రిక రిపోర్టర్ పై సైతం అట్రాసిటీ కేసు పెట్టించి నానా ఇబ్బందులు గురిచేసావు
మీ తప్పుడు కేసు వల్ల గొలగమూడికి చెందిన ఒక బీసీ నేత నల్లగట్ల సుబ్రహ్మణ్యం మనోవేదనకు గురై మృతి చెందారు
బీసీల గురించి ప్రగల్బాలు పలకడం మానుకో.. ఇక నువ్వు గెలిచేది లేదు… చచ్చేది లేదు
ఎప్పటికీ బీసీలు నీకు వ్యతిరేకంగానే పనిచేస్తారు
మా అభిమాన నేత, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పై కారు కూతలు కూయడం మానుకో
నీ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు.. వాడు, వీడు అని నోటికి వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకునేదే లేదు
మా అభిమాన నేతపై అవాక్కులు చవాకులు పేల్చితే.. ఇక నీకు మర్యాద ఉండదు
పోలీసుల చొక్కాలు ఊడతీస్తావా… నీకు రోజులు దగ్గరపడ్డాయి
జిల్లా ఎస్పీ ఒక బడుగు, బలహీన వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టే ఆయనపై నువ్వు నోటికి వచ్చినట్లు మాట్లాడావు
పోలీస్ సంఘాలు ఎందుకు స్పందించడం లేదు
పోలీస్ శాఖ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాకాణిని నిలదీయండి
మరోసారి మా అభిమాన నేతపై కారు చౌకలు పేల్చితే చూస్తూ ఊరుకునేదే లేదు
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ బీసీ అనుబంధ సంఘాల నాయకులు, బీసీ నేతలు తదితరులు పాల్గొన్నారు.