అన్నీవర్గాల వారికి సమాన అవకాశాలు రావాలని రాజ్యాంగాన్ని రచించిన గొప్ప వ్యక్తి అంబేద్కర్

అన్నీవర్గాల వారికి సమాన అవకాశాలు రావాలని రాజ్యాంగాన్ని రచించిన గొప్ప వ్యక్తి అంబేద్కర్.

బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చే కుట్రలు జరుగుతున్నాయి. అందరూ మేలుకోవాలి.

అంబేద్కర్ ఆశయాలను సమాజం కంటే ముందు మన ఇంట్లో అమలుపరచాలి.

ఈ రాజకీయ పార్టీ అయినా అంబేద్కర్ ఆశయాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే ప్రశ్నించాలి.

ఉన్నత చదువులతో నైపుణ్యంతో ప్రతి ఒక్కరూ అంబేద్కర్ లా తయారుకాగలరు.

– షేక్. అబ్దుల్ అజీజ్, నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు.

భారత రాజ్యాంగ నిర్మాత భారత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని నెల్లూరు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నెల్లూరు నగర నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షులు అరవ కిషోర్ ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు.

కార్యక్రమం లో నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, మాజీ శాసన సభ్యులు కంభం విజయరామి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాణాసంచా కాల్చి ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించి కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ….

130 సంవత్సరాలు గడిచినా ఒక సామాన్య వ్యక్తి అయిన బాబా సాహెబ్ అంబేద్కర్ ఇన్ని కొట్లాది మంది హృదయాల్లో ఉన్నాడంటే అందుకు కారణం ఆయనలో ఉన్న నిశ్వర్ధమేనని అన్నారు.

ప్రజలందరూ బాగుపడాలి, ప్రతి వర్గానికి అవకాశాలు రావాలి, చదువులో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో అందరికీ సమాన అవకాశాలు రావాలని రాజ్యాంగాన్ని రచించిన గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు.

చదువుతో నైపుణ్యంతో అందరం బాబాసాహెబ్ అంబేద్కర్ లా తయారు అవ్వచ్చు అని అనేక దేశాల్లో డాక్టరేట్లు చేసి ఉన్నత చదువులు చదివిన వ్యక్తిన బాబాసాహెబ్ అంబేద్కర్ అని అన్నారు.

బాబాసాహెబ్ అంబేద్కర్ తెచ్చిన రాజ్యాంగాన్ని మార్చే కుట్రలు జరుగుతున్నాయని, అందరూ మేలుకోవాలని కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు.

అంబేద్కర్ తెచ్చిన ఆశయాలను సమాజం కంటే ముందు మన ఇంట్లో అమలుపరచాలని, మనలో మన బిడ్డల్లో చైతన్యం రావాలని, ఆడబిడ్డలు మగ బిడ్డలు అన్న తేడా లేకుండా ప్రతి బిడ్డని ఉన్నత చదువులు చదివించాలని అన్నారు.

ఏ రాజకీయ పార్టీ అయినా అంబేద్కర్ ఆశయాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే ప్రశ్నించాల్సిన అవసరం ఉందని, తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడు బాబా సాహెబ్ అంబేద్కర్ గౌరవాన్ని ఉన్నత శిఖరంలోనే ఉంచుతుందని అన్నారు.

కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి జెన్నీ రమణయ్య, టిడిపి రాష్ట్ర కార్యదర్శి దొడ్డపనేని రాజానాయుడు, నావూరు శైలేంద్రబాబు, కాకి ప్రసాద్, నన్నే సాహెబ్, జాఫర్ షరీఫ్, సాబీర్ ఖాన్, ఇజ్రాయేల్, ఉయ్యాల జగన్మోహన్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed