*అన్ని రంగాల్లో ప్రధాని నరేంద్ర మోడీ వైఫల్యం*

*.. ఎన్నికల్లో లబ్ధి కోసమే ప్రధాని యుద్ధ ప్రకటనలు*

*. పెహల్ గామ్ ఘటనలో కేంద్ర ఇంటెలిజెన్స్ వైఫల్యం*

*. డిసిసి అధ్యక్షుడు చేవూరు దేవ్ కుమార్ రెడ్డి ధ్వజం*

*. ప్రధాని నరేంద్ర మోడీని ప్రజలు మూడుసార్లు అవకాశం ఇచ్చి గెలిపిస్తే అన్ని రంగాల్లో పూర్తిస్థాయిలో వైఫల్యం చెందారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చేవూరి దేవకుమార్ రెడ్డి విమర్శించారు. నెల్లూరు నగరంలోని ఇందిరా భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ హిందుత్వ రాజకీయాలను మోడీ ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. అమరావతి కి ప్రధాని వచ్చిన లక్ష్యం నెరవేరుతుందన్న నమ్మకం తమకు లేదన్నారు. ఎన్నికలకు ముందు ఒక మాట… ఎన్నికల తరువాత ఒక మాట ప్రధాని నైజం అన్నారు. కులగణన అంశాన్ని మొట్టమొదట పార్లమెంటులో లేవనెత్తింది కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత రాహుల్ గాంధీ కే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఈ దేశం అభివృద్ధి సాధ్యమన్నారు.*

*పెహల్ గామ్ ఘటనలో 26 మంది చనిపోయారని ఈ ఘటనకు పాల్పడ్డ తీవ్రవాదులను నేటికీ పట్టుకోలేదని విమర్శించారు ఇది ముమ్మాటికీ కేంద్ర ఇంటలిజెన్స్ వైఫల్యమని దేవకుమార్ రెడ్డి విమర్శించారు. రానున్న కాలంలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయని వీటిలో లబ్ధి పొందేందుకే పాకిస్తాన్తో యుద్ధం అంటూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రధాని మోడీ చేసింది ఏమీ లేదని చెంబుడు నీళ్లు, మట్టి..చెక్కేట్ తో సరి పెడుతున్నాడని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకొని వస్తానని ప్రతి ఒక్కరి అకౌంట్లో కోట్ల రూపాయలు వేస్తానని చెప్పిన ప్రధాన నరేంద్ర మోడీ నేడు మాట తప్పారన్నారు. వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొని బ్యాంకులకు కట్టకుండా అనేకమంది పరారయ్యారని వారిని అరెస్టు చేయడంలో మోడీ వైఫల్యం చెందారన్నారు. యువతకు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను కనీసం నెరవేర్చలేదన్నారు. ఈనెల 13న పిసిసి అధ్యక్షురాలు షర్మిల నెల్లూరు జిల్లా పర్యటనకు ఇచ్చేస్తున్నారని దానికి సంబంధించి పూర్తి షెడ్యూల్ను త్వరలో ప్రకటిస్తామన్నారు*

*ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఉడతా వెంకట్రావు, శ్రీనివాసులు రెడ్డి బాల సుధాకర్ , మోహన్ రావు, ఎస్ కె ఫయాజ్, డిసిసి జిల్లా కార్యదర్శి ఫజల్లు, తదితరులు పాల్గొన్నారు*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed