*అన్నదాతలను ఆదుకుంటాం* – రైతుల సంక్షేమమే టిడిపి లక్ష్యం – పడుగుపాడులో ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘ భవన ప్రారంభోత్సవం – పాటూరు, చెర్లోపాళెం, వేగూరు మరియు పోతిరెడ్డి పాళెం రైతుల కోసం గ్రామాలలో “మల్టిపర్పస్” గౌడోన్స్ ప్రారంభం. – సహకార సంఘాల ద్వారా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి కనీస గిట్టుబాటు ధర కల్పిస్తాం. – జిల్లాలోనే ప్రప్రథమంగా పడుగుపాడు సహకార సంఘం ఆధ్వర్యంలో “అగ్రి అవుట్ లెట్”. – ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.

*అన్నదాతలను ఆదుకుంటాం*

– రైతుల సంక్షేమమే టిడిపి లక్ష్యం
– పడుగుపాడులో ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘ భవన ప్రారంభోత్సవం
– పాటూరు, చెర్లోపాళెం, వేగూరు మరియు పోతిరెడ్డి పాళెం రైతుల కోసం గ్రామాలలో “మల్టిపర్పస్” గౌడోన్స్ ప్రారంభం.
– సహకార సంఘాల ద్వారా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి కనీస గిట్టుబాటు ధర కల్పిస్తాం.
– జిల్లాలోనే ప్రప్రథమంగా పడుగుపాడు సహకార సంఘం ఆధ్వర్యంలో “అగ్రి అవుట్ లెట్”.
– ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.

కోవూరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో రైతులు ధాన్యం ఆరబెట్టుకునేందుకు కళ్లాల ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు. ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘ భవనంతో పాటు పాటూరు, చెర్లోపాళెం, వేగూరు మరియు పోతిరెడ్డి పాళెం గ్రామాలలోని “మల్టిపర్పస్” గౌడోన్స్ మరియు ధాన్యం కొనుగోలు కేంద్రాలను పడుగుపాడులో ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు మాట్లాడుతూ మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ప్రభుత్వం కల్పించిన కనీస గిట్టుబాటు ధర కల్పించడంలో సహాయపడే సహకార సంఘాల సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవలసిందిగా రైతులను కోరారు. తక్కువ వడ్డీకి రుణాలు, నాణ్యత గల విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పరికరాలు అందించడంతో పాటు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో సహకార సంఘాల పాత్ర కీలకమన్నారు.
జిల్లాలోనే ప్రప్రథమంగా పడుగుపాడు సహకార సంఘం ఆధ్వర్యంలో “అగ్రి అవుట్ లెట్” ప్రారంభించడం చాలా సంతోషకర విషయమన్నారు. “అగ్రి అవుట్ లెట్” ద్వారా రైతులకు సంబంధించిన వ్యవసాయ పరికరాలు రాయితీ ధరలపై అందివ్వడంతో పాటు బియ్యం విక్రయాలు చేయడం ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అన్నదాతల ఆర్ధిక పరిస్థితి మెరుగు పరిచేందుకై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూ గత 2024-25 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగానికి 43 వేల 402 కోట్ల రూపాయలు బడ్జెట్‌లో కేటాయించారన్నారు. రైతులకు ఉచితంగా భూసార పరీక్షలు చేయడంతో పాటు సబ్సిడి పై విత్తనాలు, ఎరువుల సరఫరాకు సంబంధించి దాదాపు 300 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు.
“పొలం పిలుస్తోంది” అన్న కార్యక్రమాన్ని రూపొందించి వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతుల వద్దకు వెళ్లి వ్యవసాయంలో మెళకువలు నేర్పే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రైతాంగం తరుపున ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు ధన్యవాదాలు తెలియ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి (DCO) గుర్రప్ప, పెన్నా డెల్టా ఛైర్మన్ జెట్టి రాజగోపాలరెడ్డి, టిడిపి జిల్లా కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి, కోవూరు మండల టిడిపి అధ్యక్షులు ఇంతా మల్లారెడ్డి, అత్తిపల్లి శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *