*”అనైతిక కార్యకలాపాలకు తెలుగుదేశం పుట్టినిల్లు” – కాకాణి*
*SPS నెల్లూరు జిల్లా:*
*తేది:30-01-2025*
*నెల్లూరు నగర నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నెల్లూరు నగర నియోజకవర్గ ఇంచార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆనం విజయకుమార్ రెడ్డి గారు, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలతో కలిసి సమావేశమైన మాజీ మంత్రివర్యులు మరియు ఉమ్మ పాడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డా౹౹ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.*
*మహాత్మ గాంధీ వర్ధంతి సందర్బంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఆనం విజయకుమార్ రెడ్డిగారు.*
*ఫిబ్రవరి 3వ తేది జరగనున్న నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ ఎన్నికపై కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తల సూచనలు, సలహాలు తీసుకున్న కాకాణి.*
*కాకాణి స్క్రోలింగ్స్:*
👉 నెల్లూరు నగరం కార్పొరేషన్ లో 54కి 54 స్థానాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారు.
👉 వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బీఫారం పై గెలిచిన కార్పొరేటర్లు నేడు ద్రోహం చేయడం, తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్లే…
👉 మంత్రి నారాయణ రాజ్యాంగబద్ధ బాధ్యతలు నిర్వహిస్తూ కూడా మా కార్పొరేటర్లను మభ్యపెట్టి, టిడిపిలో చేర్చుకుంటున్నారు.
👉పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించడంలో చంద్రబాబుకు నీతి, నిజాయితీ ఉండదు.
👉 చంద్రబాబు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన కార్పొరేటర్లకు రేపు డిప్యూటీ మేయర్ గా బిఫారం ఇవ్వవలసిన దుస్థితి.
👉డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా నిలబడేందుకు ఒక్కరు కూడా టిడిపి బీఫామ్ పై గెలిచిన కార్పొరేటర్ లేరు.
👉వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల మనోభావాలను గౌరవిస్తుంది
👉జగన్మోహన్ రెడ్డి గారు గత ఎన్నికల్లో ముస్లిం మైనారిటీలకు ప్రధాన్యత ఇచ్చారు.
👉 డిప్యూటీ మేయర్ పదవి ఇవ్వడంతో పాటు, నెల్లూరు నగర శాసనసభ్యునిగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించారు.
👉జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాల అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయాలు చరిత్రలో మిగిలిపోయాయి.
👉 పార్టీ ఫిరాయింపులు చేసిన కార్పొరేటర్లు తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఆలోచన చేసి, ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి.
👉ఒక పార్టీలో గెలిచాం, ఒక వాణి వినిపించాం, పార్టీ మారి నేడు అధికారం కోసం భిన్నమైన అభిప్రాయాలు వినిపించడం ఆవేదనను కలుగజేస్తుంది.
👉 వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బి ఫారం పై గెలిచిన కార్పొరేటర్లు మనసు మార్చుకొని చేసిన తప్పును సరిదిద్దుకుంటారా, లేక రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసుకుంటారా.. అనేది వాళ్లే నిర్ణయించుకోవాలి.
👉 తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల పట్ల అనైతికంగా ప్రవర్తిస్తుంది.
👉 మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి సూచనలతో ప్రజల అభిమతం మేరకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది.
👉 గెలుపోటములతో సంబంధం లేకుండా, పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు అందరం కట్టుబడి ఉంటాం
👉జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చిన బీఫామ్ తో గెలిచాం, జగన్మోహన్ రెడ్డి గారి అడుగుజాడల్లో నడుస్తాం, జగన్మోహన్ రెడ్డి గారి వెంటే నిలుస్తామంటున్న కార్పొరేటర్లకు, నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు.