అనుమతులు లేని వెంచర్లపై ఉద్యమిస్తాం ముక్కు రాధాకృష్ణ గౌడ్

రియల్ ఎస్టేట్ వ్యాపారుల సంక్షేమ సంఘం రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో బుధవారం నెల్లూరు కలెక్టరేట్లోని డిఆర్ఓ కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అధికారికి వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా రియల్ ఎస్టేట్ వ్యాపారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ముక్కు రాధాకృష్ణ గౌడ్ మాట్లాడుతూ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యావత్తు రియల్ ఎస్టేట్ అక్రమాల పుట్టగా తయారైందని అందులో భాగంగా నెల్లూరు నగరంలో నెల్లూరు జిల్లాలో కూడా అవినీతి. అక్రమాలు. పెచ్చు మీరుతున్నాయని. వేలాదిగా రియల్ ఎస్టేట్ వెంచర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయని అయితే ఎక్కడా కూడా నుడ . రెరా పర్మిషన్లు తీసుకోకుండా కనీసం డి టి సి పి పంచాయతీ అప్రూవల్స్ కూడా లేకుండా లేఔట్ లు వేస్తూ ఇష్టానుసారంగా బోగస్ ప్రకటనలు చేస్తూ ప్రజలను మోసం చేస్తూ ప్లాట్లో అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్న యాజమానాలు కోట్లాది రూపాయలు ధనార్జన చేస్తున్నాయని.

ఇచ్చిన. ప్రకటనలు గాలికి వదిలి ఇస్తామన్న వసతులు కల్పించకుండా పంట కాలవలు ప్రభుత్వ భూములు శివారు. భూములు అటవీ భూములు కలుపుకొని ప్లాట్లు వేసి పార్కులకు దేవాలయాలకు మసీదులకు చర్చలకు ఇతర అవసరాలకు వదిలినట్లు మ్యాపుల్లో బ్రోచర్లలో చూపుతూ వాటిని ప్లాట్లుగా విడగొట్టి అమ్ముకుంటున్నారని.

అలాగే ల్యాండ్ కన్వర్షన్ మాత్రమే చేసి గ్రామపంచాయతీ గాని డిటిసిపి గానే నుడా రేరా వంటి సంస్థల పర్మిషన్లు తీసుకోకుండా వాటి వివరాలతో కూడిన బోర్డులు పెట్టకుండా ప్లాట్లు అమ్ముతున్నారని దీన్ని పూర్తిగా అడ్డుకుంటామని

అలాగే కన్స్ట్రక్షన్ విషయంలో ప్లాన్ అప్రూవల్ ఒక విధంగా తీసుకుని నిర్మాణాలు మాత్రం ప్లాన్ ప్రకారం కట్టకుండా. అక్రమాలకు. పాల్పడుతున్నారని దీనిపై అధికారులు ప్రజాప్రతినిధులు మాత్రం చోద్యం చూస్తున్నారని ఎద్దేవా చేశారు కావున పై విషయాలు పై సంబంధిత అధికారులు పర్యవేక్షణ చేసి దోషులను కఠినంగా శిక్షించాలని లేనిపక్షంలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు

ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు. ద్దణేష్ .నాయుడు దామెర్ల శివప్రసాద్ పి. ఉదయ్ కుమార్ కె మధు. మోజేష్. తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed