*అనికేపల్లి వైసీపీ నేత కోడూరు ప్రదీప్ కుమార్ రెడ్డి చిట్టా విప్పితే.. అవినీతి, అక్రమాల కంపే…*
*గత వైసీపీ ప్రభుత్వంలో మెక్కిందంతా ప్రతి పైసాతో సహా తిరిగి కక్కిస్తాం.. వదిలిపెట్టే ప్రసక్తే లేదు… లెక్కలతో సహా నిగ్గు తేలుస్తాం…..*
*వెంకటాచలం మండలం అనికేపల్లి గ్రామంలో ఆదివారం గ్రామస్తులు, టీడీపీ నేతలు, కార్యకర్తలతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసిన టీడీపీ మండల అధ్యక్షులు గుమ్మడి రాజా యాదవ్*
అనికేపల్లిలో సర్కార్ తోపు కింద ఉన్న రూ.3 కోట్లు విలువ చేసే 4.97 ఎకరాలను ఆక్రమించుకొని సాగు చేసుకుంటున్నాడు
గొలగమూడిలో చాకలి చెరువు కింద ఉన్న 20 ఎకరాల చెరువు పోరంబోకు భూమిని ఆక్రమించుకుని అక్రమంగా లేఆవుట్ వేసి అమ్మేశాడు
ప్రదీప్ కుమార్ రెడ్డి ఆక్రమించుకొని లేఆవుట్ వేసి అమ్మేసిన 20 ఎకరాల విలువ దాదాపు రూ.20 కోట్లకు పైగానే ఉంటుంది
జగనన్న లేఆవుట్ పేరుతో కాలనీలు నిర్మిస్తామని చెప్పి ఇసుక, సిమెంట్, కమ్మి దొబ్బేశాడు
చివరకు రూ.2 కోట్ల రూపాయల బిల్లులు స్వాహా చేశాడు… బేస్మెంట్ కూడా కట్టలేదు
జగనన్న లేఆవుట్ లెవలింగ్ పేరుతో రూ.కోటి రూపాయలకు పైగానే నొక్కేశాడు
ఇలా చెప్పుకుంటూ పోతే గత వైసీపీ ప్రభుత్వంలో ప్రదీప్ కుమార్ రెడ్డి చేసిన అవినీతి చిట్టా చాలానే ఉంది
అధికారాన్ని అడ్డం పెట్టుకుని రీ సర్వే పేరుతో భూ అక్రమాలకు పాల్పడ్డాడు
రెవెన్యూ రికార్డులు పరిశీలిస్తే ప్రదీప్ కుమార్ రెడ్డి అవినీతి బాగోతం బయటపడుతుంది
గత వైసీపీ ప్రభుత్వంలో రికార్డులను తారుమారు చేసి ప్రభుత్వ భూములను ఆక్రమించేశాడు
అనికేపల్లిలో ప్రదీప్ కుమార్ రెడ్డి చేసిన అవినీతి లీలలకు అడ్డు అదుపే లేదు
గుడి, బడి, చర్చి, ప్రభుత్వ బంగ్లాలు కాదు కదా.. చివరకు తాగేందుకు ఉన్న బావులను సైతం ఆక్రమించేసి చుట్టూ కంచెలు వేసుకుని సాగు చేసుకుంటున్నాడు
గత వైసీపీ ఐదేళ్లలో ఒకటి, రెండు కాదు.. ప్రదీప్ కుమార్ రెడ్డి చేసిన అవినీతి, అక్రమాలకు లెక్కేలేదు
వైసీపీ నేత ప్రదీప్ కుమార్ రెడ్డి చేసిన భూ ఆక్రమణలు ఒక్కొక్కటిగా వెలుగులోకి తెస్తాం
గత అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ నేతలు, కార్యకర్తలు, సానుభూతిపరులపై లెక్కలేనన్ని అక్రమ కేసులు బనాయించావు
టీడీపీ నేతలు, కార్యకర్తలు, సానుభూతిపరులపై దాడులు, అరాచకాలు, దౌర్జన్యాలు చేయించావు
వాళ్లందరి ఉసురు నీకు తగులుతుంది
గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో అనికేపల్లి వైసీపీ నేత కోడూరు ప్రదీప్ కుమార్ రెడ్డి చేసిన అవినీతి, అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ పగటి కలలు కంటున్నాడు
నీ అవినీతి, అక్రమాలను ఒక్కొక్కటిగా కక్కిస్తాం.. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆక్రమించుకున్న ప్రభుత్వ భూములను తిరిగి ప్రభుత్వానికి అప్పగిస్తాం
నీ అవినీతి, అక్రమాల బాగోతం బట్టబయలు చేసి జైలుకు పంపిస్తాం… అవసరమైతే నీ అవినీతి, అక్రమాలు తీయడంలో మేము కూడా జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాం