అనధికార లేఔట్స్ పై దూకుడు గా వ్యవహరిస్తాం – నుడా చైర్మన్ కోటంరెడ్డి
– ప్రత్యేక బృందాల ద్వారా లేవుట్స్ ని డెమోలిష్ చేస్తాం..
– మంత్రి నారాయణ ఆదేశాల మేరకు లేఔట్స్ ద్వారా వచ్చే ప్రతి పైసా నుడాకు చేరేలా చర్యలు
– కొత్తగా మరో 77 అనధికార లేఔట్స్ను గుర్తించాం.. నుడా అధికారులతో ప్రత్యేకంగా సమావేశమైన కోటంరెడ్డి
– పలు కీలక నిర్ణయాలు, అమలు చేసేందుకు ఉత్సాహంగా ఉండాలంటూ అధికారులకు పిలుపు..
ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న లేఔట్స్ ని డెమోలిష్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.. అనధికార లేఔట్స్లలో ప్రజలు ఎవరూ ప్లాట్లు కొనొద్దని.. అయన పిలుపునిచ్చారు. ముడా అధికారులతో ప్రత్యేకంగా తన చాంబర్లో సమావేశమైన ఆయన.. పలు ఆదేశాలు జారీ చేశారు. అనధికారకంగా ఉన్న మరో 44 లేఔట్లను గుర్తించామని, వాటిని కూడా డెమోలిష్ చేసేందుకు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు వెల్లడించారు.. మంత్రి పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు నుడాలో నూతన సంస్కరణలు తీసుకొస్తున్నామని స్పష్టం చేశారు. నుడా అనుమతులు లేకుండా.. లేఔట్స్ వేసిన వారికి ఇప్పటికే నోటీసులు ఇచ్చామని, వాటిని డెమోలిష్ చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. 8 నియోజకవర్గాల పరిధిలో ఇప్పటికే 260కి పైగా లేఔట్స్ గుర్తించగా కొత్తగా మరో 44 గుర్తించామన్నారు. ఈ లేఔట్స్ లో హద్దురాళ్ళు పీకేసి.. ప్రజల్లో అవగాహన కల్పిస్తామన్నారు.. నుడాను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు కోటంరెడ్డి స్పష్టం చేశారు.. ప్రభుత్వ లక్ష్యాలను చేరుకునేందుకు అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు.. ఈ కార్యక్రమంలో సిపిఓ హిమబిందు, సెక్రటరీ పెంచల్ రెడ్డి పాల్గొన్నారు