*అద్భుత విజయాన్ని అందుకున్న భారత జట్టుకు శుభాకాంక్షలు*
– యావత్ దేశం మిమ్మల్ని చూసి గర్వపడుతోంది
– ప్రపంచ ఛాంపియన్స్ ట్రోఫీ సాధించడంపై వేమిరెడ్డి దంపతుల హర్షాతిరేకాలు
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో అద్భుత విజయాన్ని సాధించిన భారత జట్టుకు నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి ప్రశాంతి రెడ్డి గారు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. భారత జట్టు విజయంపై వేమిరెడ్డి దంపతులు హర్షాతిరేఖాలు వ్యక్తం చేశారు. భారత జట్టు సభ్యులు దేశాన్ని గర్వపడేలా చేశారని అన్నారు. అద్భుత పోరాట పటిమతో దేశానికి అఖండ విజయాన్ని అందించారని కొనియాడారు. బ్యాటింగ్ లోను, బౌలింగ్ లోను రాణించి దేశానికి కప్పు అందించిన మిమ్మల్ని చూసి యావత్ దేశం గర్వపడుతోందన్నారు.