*అత్యాధునిక వసతులతో విఆర్ పాఠశాల*
– మంత్రి నారాయణ చాలా గొప్ప పనిచేస్తున్నారు
– నిరుపేద విద్యార్థులకు ఎంతో ఉపయోగం
– ప్లేగ్రౌండ్‌తో అద్భుతంగా తయారు చేస్తున్నారు
– మంత్రి నారాయణగారితో కలిసి విఆర్ పాఠశాలను పరిశీలించిన ఎంపీ వేమిరెడ్డి
నిరుపేద విద్యార్థులకు అత్యాధునిక వసతులతో కూడిన విద్య అందుబాటులోకి రానుందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారితో కలిసి నెల్లూరు నగరంలోని విఆర్ పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. ఈ పరిశీలనలో కమిషనర్ నందన్ ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. విఆర్ పాఠశాలలో ఏర్పాటు చేస్తున్న వసతులపై ఎంపీ వేమిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. గతం కంటే భిన్నంగా అత్యాధునిక వసతులు కల్పిస్తున్నారని ప్రశంసించారు. పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… పేద పిల్లల కోసం చేపట్టిన ఈ కార్యక్రమం చాలా గొప్పదని శిథిలావస్థలో ఉన్న విఆర్ హైస్కూల్ రూపురేఖలే మారిపోయాయన్నారు. ప్లేగ్రౌండ్ అద్భుతంగా తయారు చేస్తున్నారని, తల్లిదండ్రులు పనులు ముగించుకొని వచ్చేవరకు పిల్లలు ఆడుకునేందుకు ఇది ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. ఉచిత భోజనం, స్నాక్స్, ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కల్పించడం సంతోషకరమని, పాఠశాల నిర్వహణను నారాయణ గారి కుమార్తె షరణి బాధ్యత తీసుకోవడం గొప్ప విషయం అన్నారు. హైదరాబాదులోని ది బెస్ట్ స్కూలుకు దీటుగా విఆర్ పాఠశాల సిద్ధమవుతుందని వెల్లడించారు. ఈ సందర్భంగా నారాయణ గారికి, ఆయన కుమార్తె షరణీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పరిశీలనలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, మామిడాల మధు, ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు.