విజయవాడ

 

– అత్తమీద కోపం దుత్తమీద చూపినట్లుంది కూటమి ప్రభుత్వ తీరు.

– తిరుమల పవిత్రతపై YCP చేసిన పాపాన్ని, మహానేత YSR కు చుట్టడం చంద్రబాబు గారికి భావ్యం కాదు. : *వైఎస్ షర్మిలా రెడ్డి*
APCC చీఫ్

– YCP కల్తీ పనులు నాటి YSR నుంచే అనడం ఎంతమాత్రం సబబు కాదు.

– అసెంబ్లీ వేదికగా YSR గారిపై చేసిన ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది.

– దివంగత ముఖ్యమంత్రి పై చేసిన వ్యాఖ్యలను సభ రికార్డ్స్ నుంచి తొలగించాలి.

– దివంగత నేతకు చంద్రబాబు గారు క్షమాపణ చెప్పాలి.

– YSR గారు 7 కొండలను 2 కొండలు చేయాలని ఏనాడూ అనుకోలేదు.

– జరిగిందంతా తప్పుడు ప్రచారమే.

– అప్పటి ప్రతిపక్ష నేతగా బురద చల్లాలని చూసిందే మీరు.

– తిరుమల పవిత్రతకు పెద్దపీఠ వేసింది ఆనాడు YSR గారే.

– 7 కొండలు వెంకటేశ్వరుడివే అని 2007లో శాశ్వత GO ఇచ్చి చరిత్ర సృష్టించారు.

– హిందూ దేవాలయాల వద్ద అన్యమత ప్రచారం ఉండకుండా కఠిన నిబంధనలు అమలు చేశారు.

– జీవో 746,747 తెచ్చి తిరుమలను దివ్య క్షేత్రంగా మార్చారు.

– తిరుమల లడ్డూ పవిత్రతకు రక్షణగా నిలబడ్డారు.

– లడ్డూకు పేటెంట్ రైట్ సాధించింది 2009 లో నాడు YSR ముఖ్యమంత్రిగా ఉండగానే.

– వెంకన్న ఆస్తులు అన్యాక్రాంతం అవ్వకుండా ప్రత్యేక చట్టం అమలు చేశారు.

– తిరుమలలో ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం పెట్టారు.

– శ్రీ వెంకటేశ్వర వేద విశ్వ విద్యాలయం కట్టారు.

– వేద పండిట్ ల కోసం ఆనాడే YSR గారు ఆయుష్మాన్ భవ స్కీమ్ అమలు చేశారు.

– దళితులకు గోవిందుడు దగ్గరవ్వాలని అమలు చేసిన “దళిత గోవిందం” ఆనాడు మహానేత తీసుకున్న గొప్ప నిర్ణయం.

– రాష్ట్రంలో మతాలకు అతీతంగా ప్రజలు ఈ నాటికి YSR గారిని దేవుడిగా కొలుస్తున్నారంటే అది ఆయన పాలనకు నిదర్శనం.

– YCP చేసిన అరాచకాలకు YSR గారికి సంబంధం లేదు.

– YSR పాలన సంక్షేమ పాలన. YCP పాలన దోచుకు తిన్న పాలన.

-వైసీపీ పార్టీలో YSR లేడు. రాజశేఖర్ రెడ్డిగారు ముమ్మాటికి కాంగ్రెస్ మనిషి.

– కడవరకు కాంగ్రెస్ లోనే బ్రతికిన మనిషి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed