*అడవిని తలపిస్తున్న కండలేరు మట్టికట్ట..*

*డ్యాం మెయింటెనెన్స్ ఘోరం*

*బీజేపీ నమామి గంగే రాష్ట్ర కన్వీనర్ మిడతల రమేష్ ఆరోపణ…*

తెలుగు గంగ ప్రాజెక్టులో అంతర్భాగమైన కండలేరు జలాశయం మట్టికట్ట అడవిని తలపిస్తోందని బిజెపి నమామి గంగే రాష్ట్ర కన్వీనర్ మిడతల రమేష్ ఆరోపించారు. కండలేరు డ్యామ్ మట్టి కట్టను సోమవారం ఆయన పొదలకూరు మండల బిజెపి నేతలతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ కండలేరు డాం నిర్వహణ పట్ల అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. డ్యాం మట్టికట్ట మెయింటినెన్స్ గాలికి వదిలేశారని ఆరోపించారు. కండలేరు మట్టికట్ట నిర్మాణం జరిగి 30 సంవత్సరాలు దాటిన నేపథ్యంలో మట్టి కట్టను వెడల్పు చేసి పటిష్ట పరచమని నిపుణుల కమిటీ సూచించిందన్నారు. ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోక పోవడం దురదృష్టకరం అని అన్నారు. అడవిని తలపించే విధంగా మట్టి కట్టపై చెట్లు పెరిగి ఉన్నాయని, ఇవి మట్టి కట్టను బలహీన పరుస్తున్నాయని వివరించారు. మట్టి కట్ట ఒక అడుగు మేర ఎత్తు తగ్గి భూమిలోకి పోయిందని చెప్పారు. ప్రస్తుతం ఇటువంటి జలాశయం నిర్మించాలంటే రూ.60 వేల కోట్లు అవసరం అవుతుందన్నారు. ప్రభుత్వాలు ఏదైనా కొత్త ప్రాజెక్టులపై మక్కువ చూపడంతో పాటు ఉన్న ఇటువంటి ప్రాజెక్టులను రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తక్షణమే కండలేరు మట్టి కట్ట ప్రతిష్ట కోసం యుద్ధ ప్రాతిపదిక చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో పొదలకూరు మండల బీజేపీ అధ్యక్షులు పూల ప్రశాంత్, బీజేపీ సీనియర్ నాయకులు చింత గింజల సుబ్రమణ్యం, రాచపూటి ధనుంజయ రావు, నరాల సుబ్బారెడ్డి, అక్కెం జనార్దన్ రెడ్డి, డబ్బుగుంట అంకయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed