*అట్టహాసంగా ప్రారంభమైన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎన్నికల ప్రచార ర్యాలీ*

*భారీగా తరలివచ్చిన వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు, ప్రజలు మహిళలు*

*రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎన్నికల రోడ్ షోలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి*

*రెండు చేతులు జోడించి ప్రజలకు అభివాదం చేస్తూ ప్రచార ర్యాలీని కొనసాగించిన ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి గార్లు*

*డైకాస్ రోడ్ సెంటర్ నుండి అట్టహాసంగా ప్రారంభమైన ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డిగార్ల ఎన్నికల రోడ్ షో*

*జనసంద్రంగా మారిన పొదలకూరు రోడ్డు రహదారి*

*అభిమాన నాయకులు మద్దతు తెలిపేందుకు దారి పొడవునా భారీగా బారులుతీరిన ప్రజలు*

*ఇళ్లపై నుండి, దారి పొడవునా ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి మా మద్దత్తు వైఎస్ఆర్ సీపీకే అంటూ రెండు చేతులు ఊపి సంఘీభావం తెలిపారు*

*అడుగడుగునా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డికి బ్రహ్మరథం పట్టిన ప్రజలు*

*మంగళహారతులు పట్టి గుమ్మడికాయలతో దిష్టి తీసి అడుగడుగునా పూల వర్షం కురిపించి అభిమాన నాయకులు ఆదాల ప్రభాకర్ రెడ్డి, విజయసాయిరెడ్డిగార్లపై అభిమానం చాటుకున్న ప్రజలు*

*ఎన్నికల ప్రచార ర్యాలీకి అశేషంగా తరలివచ్చిన ప్రజలకు, వైసీపీ శ్రేణులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన రూరల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి*

*డైకాస్ రోడ్ సెంటర్ నుండి నిప్పో సెంటర్, వాటర్ ట్యాంక్, పద్మావతి సెంటర్, సారాయిఅంగడి సెంటర్, పొదలకూరు సెంటర్, ఎస్పీ బంగ్లా, కలెక్టర్ బంగ్లా, డీకే డబ్ల్యూ కాలేజ్ రహదారి మీదుగా బట్వాడిపాళ్లెం వరకు జై జగన్, జై జై జగన్, జై హో అదాల, జయహో విజయసాయి రెడ్డి, జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఫ్యాను గుర్తుకే మన ఓటు, హోరెత్తిన నినాదాల నడుమ కొనసాగిన భారీ ఎన్నికల రోడ్ షో ర్యాలీ*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed