*అట్టడుగు వర్గాల అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం*

– 7 నెలల వ్యవధిలో కొడవలూరు మండల అభివృద్ధికి 6 కోట్ల 50 వెచ్చించాం.
– షాదిమంజిల్ ఆధునీకరణకు 10 లక్షలు మంజూరు.
– వీధి లైట్లకు కూడా నోచుకోని గ్రామాలు అభివృద్ధి బాట పడుతున్నాయి.
– అధికారులు నాయకుల మధ్య సమన్వయం అవసరం.
– ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.

చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో పల్లెలు ప్రగతి బాట పడుతున్నాయన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు. 5 లక్షల వ్యయంతో నిర్మించిన సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి కొడవలూరు మండల కేంద్రానికి విచ్చేసిన ఆమెకు టిడిపి కూటమి నాయకులు బ్రహ్మరధం పట్టారు. అడుగడునా హారతులతో అపూర్వ స్వాగతం పలికారు. రోడ్డు ప్రారంభోత్సవ అనంతరం ఆమెషాదీ మంజిల్ సందర్శించారు. షాదీ మంజిల్ ఆధునీకరణ పనులకై ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో 10 లక్షలు CSR నిధులు మంజూరు చేశారు. కొడవలూరు మండల వ్యవసాయ శాఖ కార్యాలయ మరమ్మత్తుల కోసం 5 లక్షల రూపాయలు కేటాయించారు. స్థానిక ప్రాధమిక వైద్యశాలను సందర్శించిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు వసతుల లేమిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపి నిధుల ద్వారా హాస్పిటల్ లో టాయిలెట్స్ తదితర మౌలిక సదుపాయాలు కల్పిస్తానన్నారు.
అనంతరం ఆమె ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ గత ఐదేళ్లలో జరిగిన అరా కొరా పనులు కూడా కాట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా అసంపూర్తిగానే వున్నాయన్నారు. రోడ్లు, డ్రైన్లు లాంటి అభివృద్హి పనులు స్థానిక నాయకులే నాణ్యతా ప్రమాణాలు పాటించి పూర్తి చేయాలని కోరారు. మార్చిలో ఇళ్ళు లేని ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు. గతంలో తట్టెడు మట్టి కూడా వేయలేని పరిస్థితిలో వున్న గ్రామీణ ప్రాంతాలలో పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ రాజ్ మంత్రి అయ్యాక కొత్త రోడ్డు నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. ఒక్క కొడవలూరు మండలంలోనే గత 7 నెలలలో 6 కోట్ల 50 లక్షల అభివృద్ధి పనులు చేశామన్నారు. మరో 1 కోటి మిగులు నిధులున్నాయన్నారు. అట్టడుగు వర్గాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పాలనలోనే న్యాయం జరుగుతుందన్నారు. స్థానిక నాయకులు గ్రామీణ సమస్యలపై దృష్టి సారించాలని అధికారులతో మమేకమై ప్రజా సమస్యలు తీర్చడంలో చొరవ చూపాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ సుబ్బారావు, తహసీల్దారు స్ఫూర్తి రెడ్డి, టిడిపి రాష్ట్ర కార్యదర్శి జి ఎన్ శేఖర్ రెడ్డి, టిడిపి సీనియర్ నాయకులు వెంకటరమణా రెడ్డి, మండల పార్టీ ఇంచార్జి ముంగమూరు శ్రీహరి రెడ్డి, బెజవాడ వంశీకృష్ణా రెడ్డి, జిలానీబాషా, పంది శ్రీనివాసులు, వెంకీ, నాయబ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *