* అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో 53వ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వరపురం విజయ పాలడైరీ ఎదురుగా స్థానిక మహిళలతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా అనేక రంగాలలో ఉన్న మహిళలను పిలిచి ఘనంగా సత్కరించారు.
* ఈ సందర్భంగా ఐద్వా నెల్లూరు నగర అధ్యక్ష,కార్యదర్శులు ఎన్ వి సుబ్బమ్మ, కత్తి పద్మ మాట్లాడారు.
* మహిళలపై లైంగిక వేధింపులు, దాడులు నిత్య కృత్యంగా జరుగుతున్నాయని అన్నారు. ప్రభుత్వాలు ప్రకటనలకు ప్రచార అర్భాటాలకు పరిమితమయ్యాయి తప్ప ఆచరణ శూన్యమైని అన్నారు. పురుషులతో సమానంగా ప్రతి రంగంలో మహిళ పై చేయి సాధిస్తున్న నేటికీ సమాజంలో మహిళను చిన్నచూపు చూసే పరిస్థితి కొనసాగుతున్నదని అన్నారు. పని ప్రదేశాలలో వేధింపులు,గృహహింస ఈ కాలంలో తీవ్రతరమైనదని అన్నారు. నూతన మద్యం పాలసీ పేరుతో మద్యాన్ని ఏరులై పాలించడం వల్ల ఈ పరిస్థితి మరింత జటిలమైనదని అన్నారు. మహిళల సాధికారత చిత్తశుద్ధితో ప్రభుత్వాలు చేపడితే మహిళల అభివృద్ధి మరింత జరిగేందుకు అవకాశం ఉన్నదని అన్నారు. మహిళలకు వేతనాలు అన్ని రంగాలలో అత్యంత వివక్ష పూరితంగా అమలవుతున్నాయని అన్నారు. మహిళలందరూ సంఘటితంగా ముందుకు వచ్చి సమస్యల పరిష్కారానికి పోరాడాల్సిన పరిస్థితి ఉన్నదని తెలిపారు. నెల్లూరు జిల్లా అక్షరాస్యత సారా ఉద్యమంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి స్ఫూర్తిగా నిలిచినదని తెలిపారు. రాబోయే రోజుల్లో మహిళా సమస్యల పరిష్కారం కోసం జరిగే ఉద్యమాలలో అత్యధిక సంఖ్యలో మహిళలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
* ఈ కార్యక్రమంలో డాక్టర్లు,ఉద్యోగులు,అసంఘటిత రంగ కార్మికులు,పొదుపు మహిళలు రంగాలలో ఉన్న అనేకమంది మహిళలు పాల్గొని ప్రసంగించారు.
* ఈ కార్యక్రమంలో స్థానిక ఐద్వా నాయకులు షేక్ మహమ్మద,ఎన్ మంజుల షకీలా,భార్గవి,లక్ష్మి, విజయలక్ష్మి,షబ్బీర,ఖాదరమ్మ, సుశీలమ్మ తదితరులు పాల్గొన్నారు.