అక్రమ మద్యం పట్టిస్తే కాకాణి పై కేసులు లేవని, సోమిరెడ్డి మానవతా దృక్పథంతో ఎస్టీ కుటుంబానికి సహాయం చేస్తే వాటిపై కేసులు పెట్టారు : ఆబ్దుల్ అజీజ్
ఎన్నికల ప్రక్రియ అనంతరం వైసిపి నాయకుల బాడీ లాంగ్వేజ్ మారిపోయిందని ఫ్రస్టేషన్కు లోనై ఈవిఎంలో ధ్వంసం చేయడం దాడులు చేయటం చేస్తున్నారని అన్నారు.
పోలీసు వ్యవస్థలను అడ్డం పెట్టుకుని కాకాని గోవర్ధన్ రెడ్డి తెలుగుదేశం కార్యకర్తలపై వీరంగం సృష్టించారని అన్నారు.
అక్రమ మద్యం పట్టిస్తే కాకాణి పై కేసులు లేవని, సోమిరెడ్డి మానవతా దృక్పథంతో ఎస్టీ కుటుంబానికి సహాయం చేస్తే వాటిపై కేసులు పెట్టారు.
నాలుగు రోజుల్లో అధికారం కోల్పోతున్న కాకాణి స్వభావం మారటం లేదని, ఆయన చేష్టలకు సర్వేపల్లి లో ప్రజలు చీకుడుతున్నారని అన్నారు.
అధికారం చేపట్టినప్పటి నుంచి కోర్టు గొడవలు ఇసుక మాఫియాలు భూ దందాలు పనిగా పెట్టుకున్నారని ఆయన వల్ల ఒక అధికారి సస్పెండ్ అయ్యారని, ఇంకో అధికారి సస్పెండ్ అయ్యే పరిస్థితిలో ఉన్నారని అన్నారు.
కోట్ల రూపాయల ఆక్వా రైతుల చెరువులను ధ్వంసం చేశారని, క్వార్ట్జ్ పంపకంలో సొంత పార్టీ నేతలతో గొడవలు పడటం జరిగిందని అన్నారు.
ప్రజాస్వామ్యం అంటే వైసిపి నాయకులకు ఎగతాళిగా మారిందని అన్నారు.
వైసిపి నాయకులు చేసిన అరాచకాలపై టిడిపి ప్రభుత్వం రాంగానే ఆరా తీస్తామని, ఎవ్వరిని వదలబోయేది లేదని హెచ్చరించారు.
జిల్లా ఎస్పీకి కలెక్టర్ కి ప్రొటెక్షన్ ఏర్పాటు చేయాల్సిన పరిస్థితిలో వచ్చాయని, తమని తాము కాపాడుకుంటూ వ్యవస్థని కాపాడాలని కోరారు.
కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని ప్రత్యేకంగా పోస్టల్ బ్యాలెట్ ఈవీఎంలను జాగ్రత్త చేయాలని సూచించారు. వైసిపి నాయకులకు ఉన్న ఫ్రస్టేషన్ కి ఏదైనా చేసేలా ఉన్నారని అన్నారు.