*అక్రమ నిర్మాణాలను గుర్తించి నోటీసులు జారీ చేయండి*
*- అదనపు కమిషనర్ వై.ఓ. నందన్*
నెల్లూరు కార్పొరేషన్ (మేజర్ న్యూస్):
నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లలో అనధికార, అక్రమ నిర్మాణాలను గుర్తించి వాటి యజమానులకు నోటీసులు జారీ చేయాలని వార్డ్ సచివాలయ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ కార్యదర్శులను కమిషనర్ వై.ఓ నందన్ ఆదేశించారు. వారాంతపు సమీక్షలో భాగంగా కార్పొరేషన్ కార్యాలయం కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో శుక్రవారం పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు, వార్డు సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ ప్రతి ఒక్క వార్డు ప్లానింగ్ కార్యదర్శి తమ లాగిన్లను రెగ్యులర్గా తనిఖీ చేసుకోవాలని సూచించారు. లాగిన్ లలో ఏలాంటి ఫైళ్లు పెండింగ్లో ఉంచుకోకుండా ఎప్పటికప్పుడు పరిష్కారానికై ఉన్నతాధికారులకు ఫార్వర్డ్ చేయాలని సూచించారు. సంబంధిత షార్ట్ ఫాల్స్ ను ఉన్నతాధికారులకు తెలియజేసి క్లియర్ చేయించాలని తెలిపారు. అనధికార, అక్రమ నిర్మాణాలపై పి.ఓ, సి.ఓ నోటీసులను జారీ చేసి అవసరమైన పక్షంలో చార్జి షీట్లను దాఖలు చేయాలని సూచించారు.అదేవిధంగా
అనధికార లేఔట్లను గుర్తించి వాటి యజమానులకు నోటీసులు జారీ చేయాలని సూచించారు. వచ్చే బుధవారం ఎల్.ఆర్.ఎస్ పథకంపై మెగా మేళాను నిర్వహించనున్నారని, ప్రతి ఒక్క లేఔట్ యజమానికి సమావేశంపై అవగాహన కల్పించి హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ సమావేశంలో సి.పి హిమబిందు, డి.సి.పి. పద్మజ, ఏ.సి.పి.లు వేణు, ప్రకాష్, సర్వేయర్ సోమేశ్వర రావు, సూపెరెంటెండెంట్ పద్మ ,వార్డ్ ప్లానింగ్ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.