
*”స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర” నవంబర్ నెల థీమ్ అయిన వ్యక్తిగత & సామూహిక పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్న కమిషనర్ వైఓ నందన్*
స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర
వ్యక్తిగత & సమాజ పరిశుభ్రత
“స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర” నవంబర్ నెల థీమ్ అయిన వ్యక్తిగత & సామూహిక పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రివర్యులు పి. నారాయణ, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ల సూచనల మేరకు నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ నేతృత్వంలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 15 మున్సిపల్ పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలను శనివారం నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా పచ్చదనం పెంపొందించుటకు గాను రూరల్ పరిధిలోని 15 డివిజన్లలో 35 ప్రదేశములలో 2370 చెట్లను నాటు కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమాల్లో విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత, పర్యావరణ పరిశుభ్రత, నీటి సంరక్షణ, చేతులు సరిగా కడుక్కోవడం వంటి విషయాలపై అవగాహన కల్పించారు. ప్రత్యక్ష ప్రదర్శనల ద్వారా మంచి అలవాట్లను అలవర్చుకునేలా ప్రోత్సహించారు.
ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ తో పాటు మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కనకద్రి, అసిస్టెంట్ డైరెక్టర్ హార్టికల్చర్ నరసింహారావు, స్కూల్ సిబ్బంది మెడికల్ ఆఫీసర్లు, పాల్గొని, విద్యార్థులతో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. ఆరోగ్యవంతమైన పరిశుభ్రత అలవాట్లు అలవరచుకోవాలని విద్యార్థులకు వారు అవగాహన కల్పించారు.