
*స్వచ్ఛ ఆంధ్ర – స్వఛ్చ – దివస్ సందర్భంగా చీపురు పట్టిన ఎమ్మెల్యే ప్రశాంతమ్మ*
– పరిశుభ్రత నిత్య జీవితంలో భాగం కావాలి
– స్వచ్ఛత అనేది ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత.
– పరిశుభ్రత ముందుగా మన యింటి నుంచే ప్రారంభం కావాలి.
– స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు కలిసి పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలి.
– ప్రతి నెల 3 వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వఛ్చ – స్వఛ్చ దివస్ కార్యక్రమంలో పాల్గొని సిఎం చంద్రబాబు, ప్రధాని మోడి ఆశయ సాధనకు కృషి చేయాలి.
– జొన్నవాడలో స్వచ్ఛ ఆంధ్ర స్వఛ్చ – స్వఛ్చ దివస్ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి పరిశుభ్రతే దైవత్వమనే పెద్దల మాటను ఆచరణలో నిజం చేసి చూపాలన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు. స్వఛ్చ ఆంధ్ర – స్వఛ్చ దివస్ సందర్భంగా ఆమె బుచ్చిరెడ్డి పాళెం మండలం జొన్నవాడ గ్రామంలో పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. జొన్నవాడ కామాక్షమ్మ ఆలయ పరిసరాలలో ఆమె స్వయంగా చీపురు పట్టి వీధులు శుభ్రం చేసి స్వఛ్చ ఆంధ్ర – స్వఛ్చ దివస్ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ లా మారారు. అనంతరం ప్రజలచే పరిసరాల పరిశుభ్రత ప్రాధాన్యతను తెలియచేసే స్వఛ్చ ఆంధ్ర – స్వఛ్చ దివస్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు మాట్లాడుతూ పరిశుభ్రత నిత్య జీవితంలో భాగం కావాలన్నారు. స్వచ్ఛత అనేది ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని పెద్దలు పిల్లలకు పరిసరాల శుభ్రత పై అవగాహన కల్పించాలని కోరారు. పరిసరాల ప్రశుభ్రతే లక్ష్యంగా సిఎం చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోడి గార్లు తలపెట్టిన స్వచ్ఛ ఆంధ్ర స్వఛ్చ – స్వఛ్చ దివస్ కార్యక్రమాన్ని గ్రామ స్థాయిలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు కలిసి నిర్వహించి పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
జొన్నవాడ కామాక్షమ్మ ఆలయానికి వచ్చే భక్తులు ఎక్కడంటే అక్కడ వ్యర్ధాలు వేయకుండా ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేయాలన్నారు. ఒక భక్తుడు ఆలయ ప్రాంగణంలో పడి వున్న కాగితాన్ని మనం తీసి డస్ట్‌బిన్‌లో వేసినా అది మనం అమ్మవారికి చేసే నిజమైన సేవ అవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జొన్నవాడ ఆలయ ఛైర్మెన్ తిరుమూరు అశోక్ రెడ్డి. సర్పంచ్ పెంచలయ్య, ఆలయ ఇఓ శ్రీనివాసులు రెడ్డి బుచ్చి మున్సిపల్ ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజ, టిడిపి సీనియర్ నాయకులు బెజవాడ వంశీకృష్ణారెడ్డి, రాష్ట చేనేత సంఘ నాయకులు కెవి శేషయ్య, జొన్నవాడ ఆలయ పాలకమండలి సభ్యులు మరియు స్థానిక టిడిపి, బిజెపి, జనసేన నాయకులు పాల్గొన్నారు.