
*స్త్రీలకు మనోధైర్యమే ఆయుధం*
– సమాజానికి ఉత్తమ పౌరులు అందించడంలో స్త్రీల పాత్ర కీలకం.
– జీవితంలో ఒడిదుడుకులను ఓర్పుతో ఎదుర్కోవాలి.
– సహనం మహిళల పాలిట ఆభరణం.
– ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
ఎవరో ఏదో అనుకుంటారని వెనుకడుగు వేసే స్వభావం వీడి మహిళలు అన్ని రంగాలలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు. నెల్లూరు నగరంలోని టౌన్ హాల్లో శ్రీ పరంజ్యోతి స్త్రీ శక్తి అనే కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు మహిళలను ఉద్దేశించి తమ అమూల్య సందేశాన్ని అందించారు. స్త్రీలు స్వతహాగా శక్తివంతులని తమలో అంతర్లీనంగా దాగి ఉన్న శక్తిని వెలికి తీసి ప్రపంచానికి చాటాలని కోరారు. కాపురాన్ని చెక్కబెడుతూ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతూ పెద్దల పట్ల గౌరవ మర్యాదలతో మహిళలు తమ ఔనత్యం చాటుకోవాలని కోరారు. సమాజానికి ఉత్తమ పౌరులు అందించడంలో స్త్రీల పాత్ర కీలకమన్నారు. జీవితంలో ఒడిదుడుకులను ఓర్పుతో ఎదుర్కోవాలని ఎటువంటి పరిస్థితులలో మనోధైర్యం కోల్పోకూడదని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు హితవు పలికారు. సహనం మహిళల పాలిట ఆభరణంమని మహిళలు ఆత్మభిమానంతో జీవించాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలోసౌజన్య భగవత్ దాసాజి భారతి, అనిత, రమణయ్య, కిషోర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.