*సుందరయ్య కాలనీ హైవే నందు అండర్పాస్ బ్రిడ్జి నిర్మించాలి అని ధర్నా*

సుందరయ్య కాలనీ నేషనల్ హైవే వద్ద అండర్పాస్ బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ 23, 24 డివిజన్ శాఖల ఆ


ధ్వర్యంలో నేషనల్ హైవే మీద జాతీయ రహదారి పై ధర్నా నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాదాల వెంకటేశ్వర్లు, రూరల్ కార్యదర్శి కొండా ప్రసాద్ మాట్లాడుతూ జాతీయ రహదారి ఏర్పాటు చేసి దాదాపు 22 సంవత్సరాలు పూర్తయింది. సుందరయ్య కాలనీ వద్ద బాక్స్ టైప్ బ్రిడ్జి లేకపోవడం వలన సుందరయ్య కాలనీ వద్ద జరిగిన ప్రమాదాలలో అనేకమంది మరణించడం జరిగింది . ఇక్కడ భారత జవాన్లు కూడా మృతి చెందడం బాధాకరం.

ఈ రెండు డివిజన్లో పరిధిలోని పడారుపల్లి, సుందరయ్య కాలనీ, ఆర్ డి టి కాలనీ, హౌసింగ్ బోర్డ్, కల్లూరుపల్లి, ఇందిరమ్మ కాలనీ తదితర ప్రాంతాల్లో దాదాపు 5వేల కుటుంబాలు నివాసం ఉంటున్నారు. వీళ్లంతా ప్రతినిత్యం రోజువారి పనులు నిమిత్తం హైవే దాటుకుని నెల్లూరు నగరానికి రోజువారి పనులు నిమిత్తం రాకపోగా కొనసాగిస్తున్నారు.

పడారిపల్లి రైతులు వ్యవసాయ ఆధారిత పనులు నిమిత్తం హైవేపై నిత్యం రాకపోకలు కొనసాగిస్తున్నారు. గొలగమూడి రోడ్ లోనే ఫ్లైఓవర్ బ్రిడ్జి పూర్తయిన తర్వాత, సుందరయ్య కాలనీ దిగువున ఉన్న ప్రాంతాల వారి యొక్క ఇళ్లకు చేరుకోవడానికి గొలగమూడి ఫ్లైఓవర్ బ్రిడ్జి నుండి తిరిగి రావాల్సిన పరిస్థితి ఉంది.

అత్యవసర సమయాల్లో ఇక్కడ నుండి పోవాలన్నా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రజల ప్రాణాలు కాపాడే దానికి, సుందరయ్య కాలనీ హైవే వద్ద అండర్పాస్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు కే. పెంచల నరసయ్య, కే. సతీష్, ఓ. సుధీర్, ఎస్కే షాహినా బేగం, కండే కోటేశ్వరరావు, సురేష్, వీర్ల శ్రీనివాసులు, చైతన్య, చంద్రమౌళి, బాపనయ్య, మదన్, వెంకటసుబ్బయ్య, మురళి, , సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed