*సిపిఎం రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని కోరుతూ నెల్లూరు సిటీ గుర్రాలు మడుగు సంఘంలో ఇంటింటి ప్రచారం చేసిన సిపిఎం నేతలు.*
*ఫిబ్రవరి మూడవ తేదీ ఆత్మకూరు బస్టాండ్ సెంటర్ నుండి మహా ప్రదర్శన – విఆర్సీ గ్రౌండ్స్ లో జరుగు భారీ బహిరంగ సభలను జయప్రదం చేయండి.*
*ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు రాష్ట్ర మహాసభల ప్రాధాన్యతను వివరించి విరాళాలు సేకరించిన సిపిఎం రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు*
*సిపిఎం రాష్ట్ర మహాసభలు నెల్లూరులో జరుగుతున్న సందర్భంగా సింహపురి ప్రజలు అపూర్వ ఆదరణ చూపిస్తున్నారు : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.వెంకటేశ్వర్లు**
*****************************
* భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) ఆంధ్ర ప్రదేశ్ 27వ రాష్ట్ర మహాసభలు నెల్లూరులో ఫిబ్రవరి 1,2,3 తేదీలలో జరుగుతున్న సందర్భంగా నెల్లూరు సిటీ పరిధిలోని 16 డివిజన్ గుర్రాలు మడుగు సంఘంలో ఇంటింటికి తిరిగి ప్రజలను కలిసి మహాసభ ప్రాధాన్యతను వివరించి విరాళాల సేకరణ కార్యక్రమాన్ని సిపిఎం నాయకులు మరియు కార్యకర్తలు నిర్వహించారు.
* ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం. మోహన్ రావు, నెల్లూరు నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు, నగర కార్యదర్శి వర్గ సభ్యులు కాయంబు శ్రీనివాసులు పాల్గొని ప్రజలను కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….
* భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర పోషించిన, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన ఆదర్శ నేత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య జన్మించిన సిపిఎం రాష్ట్ర 27వ ఆంధ్రప్రదేశ్ మహాసభలు నిర్వహించడం గర్వకారణమని అన్నారు. మహాసభల ప్రాధాన్యతను వివరిస్తూ ప్రజలను కలుస్తున్న సందర్భంలో ప్రజలందరూ నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడే సిపిఎం పార్టీ అభివృద్ధి కావాలని,మహాసభల జయప్రదం కోసం ప్రతి ఒక్కరం తప్పక కృషి చేస్తామని,పాల్గొంటామని అపూర్వమైన ఆదరణ చూపిస్తున్నారని అన్నారు. పేదలు ఇచ్చిన చిన్న చిన్న విరాళాలతోనే మహాసభలు నిర్వహిస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సమస్యలు పరిష్కరించే ప్రజా ఉద్యమాలు పోరాటాలు, అభివృద్ధిలో ప్రభుత్వాలు అనుసరించే సక్రమమైన విధానాలు కోసం భవిష్యత్ పోరాటాలు రాష్ట్ర మహాసభలలో సింహపురి గడ్డపై రూపకల్పన జరుగుతుందని అన్నారు. సిపిఎం రాజకీయ విధానాన్ని,భవిష్యత్తు ప్రణాళికను సింహపురి వేదికగా ప్రకటించబోతున్నట్టు తెలిపారు. దీనిలో భాగంగా ఫిబ్రవరి 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆత్మకూరు బస్టాండ్ సెంటర్ నుండి మహాప్రదర్శన మరియు వి. ఆర్. సి గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభ జరుగుతుందని తెలిపారు.వేలాదిగా ప్రజలు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు.
* ఈ కార్యక్రమంలో 16వ డివిజన్ శాఖ కార్యదర్శులు ఎం ఆనంద్ కుమార్, కే సంపూర్ణమ్మ, కుమార్, రాజా, ఆటో కార్మికులు స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు.