
*సిఎం చంద్రబాబు నాయుడు ప్రేరణతో అధికారులు, నాయకులు సమన్వయంతో పనిచేశారు*: *ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.*
– రియల్ టైం గవర్నెస్ లోఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. భాగంగా క్షేత్ర స్థాయిలో అధికారులకు దిశా నిర్దేశం చేయడంలో మంత్రి లోకేష్ చొరవ అభినందనీయం.
– అధికారులు, నాయకులు సమిష్టి కృషితో తుఫాను సహాయక చర్యలు చేపట్టారు.
– వరద బాధితులకు అండగా నిలిచిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మరియు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలకు అభినందనలు.
– అధికారులు, నాయకులు కలిసి సమిష్టిగా పని చేస్తే ప్రజలకు ఎంత మేలు జరుగుతుందో ఆచరణలో చేసి చూపించారు.
– ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
తుఫాను తీవ్రతపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిరంతర పర్వేక్షణ చేస్తూ అధికార యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడం వల్లే ఆస్థి , ప్రాణ నష్టాలను నివారించ గలిగామన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు. ఇందుకూరు పేట మండల కేంద్రంలో మంధా తుఫాను కారణంగా ఉపాధి కోల్పోయిన మత్స్యకార సోదరులకు ఆమె నిత్యావసర సరుకుల కిట్లు పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు మాట్లాడుతూ మత్స్యకార సోదరులకు ప్రభుత్వం తక్షణ సహాయంగా 50 కిలోల బియ్యంతో పాటు 1 కిలో కందిపప్పు, 1 కేజీ పామాయిల్, కిలో ఉల్లగడ్డలు, కిలో ఎర్రగడ్డలు అందచేసిందనన్నారు.
ముంపు ప్రాంత వాసులను పునరావాస కేంద్రాలకు తరలించి అధికారులతో కలిసి సహాయక చర్యలలో పాల్గొన్న టిడిపి మరియు కూటమి పార్టీ నాయకులను ఆమె అభినందించారు. నిత్యం అందుబాటులో వుంటూ పరస్పర సమన్వయంతో పని చేసి ప్రజలకు ఏ ఇబ్బంది రాకుండా కంటికి రెప్పలా కాపాడిన రెవెన్యూ, పోలీస్ మరియు వైద్య శాఖాధికారుల పనితీరును ఆమె ప్రశంసించారు. చంద్రబాబు గారి ప్రేరణతో తుఫాను సహాయక బాధ్యతను తమ భూజాల కెత్తుకొని సహాయక శిబిరాలలో వుంటున్న బాధితులకు భోజనం, చిన్న పిల్లలకు పాలు అందించన నాయకులు, కార్యకర్తలు ముందు ముందు యిదే స్పూర్తితో పని చేయాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గోపికృష్ణ, ఎంపీడీఓ నాగేంద్ర బాబు, జెడ్ పి వైస్ ఛైర్మెన్ శ్రీహరికోట విజయలక్ష్మి, టిడిపి మండల అధ్యక్షులు ఏకొల్లు పవన్ కుమార్ రెడ్డి, టిడిపి సీనియర్ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, వెస్ట్ పాళెం పెద్ద కాపు ఊటుకూరు సుబ్రహ్మణ్యం, ఈస్ట్ పాళెం పెద్దకాపు శ్రీహరి శ్రీనివాసులు, మత్స్యకార నాయకులు పామంజి నరసింహ, ఊటుకూరు రాజ, ముక్కంటి చంద్ర, కటారి బాబు, అంగేరి మల్లయ్య, ముక్కంటి అంకయ్య, వైస్ ప్రెసిడెంట్ ఊటుకూరు ప్రసాద్, వియ్యాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.