
*సింగపేట (అల్లూరు మండలం) దుర్ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ బీద*
బొలెరో వాహనం బోల్తా పడి బట్లదిన్నె గ్రామానికి (కావలి రూరల్ మండలం) చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉప్పాల శీనయ్య, బండ్ల ప్రసాద్ లు ప్రాణాలు కోల్పోవడం బాధించింది.
ఉప్పాల శీనయ్య, బండ్ల ప్రసాద్ ల మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. మృతుల కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది.
ఉపాధి పనుల నిమిత్తం బయలుదేరిన ఉప్పాల శీనయ్య, బండ్ల ప్రసాద్ లు మరణించగా, మరో 5 మంది తీవ్రంగా గాయపడ్డారు, వీరికి మెరుగైన వైద్య సేవలు అందేలా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలి.
బాధిత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలను, జాగ్రత్తలను అధికారులు తీసుకోవాలి.
సింగపేట దుర్ఘటనలో గాయపడిన క్షతగాత్రులు త్వరితగతిన కోలుకోవాలని కోరుకుంటూ, ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను.
*బీద రవిచంద్ర*
*శాసన మండలి సభ్యులు*
*టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి*