
*సచివాలయ ప్లానింగ్ అండ్ రెగ్యులరైజేషన్ కార్యదర్శులు 42 మందికి షోకాజు నోటీసులు జారీ చేసిన కమిషనర్*
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై .ఓ నందన్ ఆదేశాల మేరకు పట్టణ ప్రణాళిక విభాగం వార్డు సచివాలయ ప్లానింగ్ అండ్ రెగ్యులైజేషన్ కార్యదర్శులు 42 మంది సిబ్బందికి షోకాజు నోటీసులను సోమవారం జారీ చేశారు.
కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో ఆదివారం నిర్వహించిన సమీక్ష సమావేశానికి వీరంతా హాజరుకాని కారణంగా సంజాయిషీ వివరణ 24 గంటల లోపల అందజేయాలని కమిషనర్ ఆదేశించారు.