*సంప్రదాయ వస్తువులతో భోగిమంటలు వేద్దాం…పర్యావరణాన్ని కాపాడుదాం*
*సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పిలుపు*
*ది పీఎంపీ అసోసియేషన్ ఆప్ ఇండియా, బ్లాక్ బోర్డు మిత్రమండలి ప్రతినిధులు రూపొందించిన ప్రచార పత్రాలను విడుదల చేసిన సోమిరెడ్డి*
సర్వశుభాల కోసం భోగి మంటలు వేయడం మన సంప్రదాయం
తాటి ఆకుతో పాటు పిడకలు, చాటలు, గంపలు, చీపుర్లు, మంచాలు లాంటి పాత వస్తువులనే భోగి మంటల్లో వేయాలి
టైర్లు, ట్యూబులతో పాటు ప్లాస్టిక్ తో చేసిన చీపుర్లు, చాటలు, గంపలు, రబ్బరు, చర్మంతో చేసిన చెప్పులు, టెర్లిన్ సిల్క్ వస్త్రాలు భోగి మంటల్లో వేస్తే గాలి, నీరు, నేల ప్రమాదభరిత కాలుష్యంలో చిక్కుకుంటాయి
ఆ కాలుష్యం కారణంగా టీబీ, చర్మ వ్యాధులు, నేత్ర సంబంధిత సమస్యలతో పాటు ప్రాణాంతక కేన్సర్ సోకే ప్రమాదముంది
చిన్నారులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆ కాలుష్యం అత్యంత ప్రమాదకం
పర్యావరణాన్ని కాపాడుకోవడాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి
కార్యక్రమంలో పాల్గొన్న శాఖవరపు వేణుగోపాల్, డాక్టర్ కె.శ్యాం ప్రసాద్ శశాంక్, నరసాపురం ప్రసాద్, కోలా రవీంద్రబాబు, గోరంట్ల శేషయ్య, షేక్ మహమ్మద్ గౌస్, కె.రామరాఘవయ్య, షేక్ గౌస్ బాషా తదితరులు