
*శ్రీశైలంలో కార్తీక కోటి దీపాన్ని వెలిగించిన ఎమ్మెల్యే ప్రశాంతమ్మ*
పవిత్ర కార్తీక మాస సోమవారం సందర్భంగా కోవూరు ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు శ్రీశైలం మహా పుణ్య క్షేత్రం లో కార్తీక కోటి దీపం వెలిగించారు.
సోమవారం శ్రీశైలం వెళ్లిన ఆమె ఈ సందర్భంగా దీపం వెలిగించి శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి ఆశీస్సులు అందుకున్నారు.
కార్తీక మాస సోమవారం సందర్భంగా కోటి దీపం వెలిగించడం సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు. స్వామి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో ఆలయ అధికారులు, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, బెజవాడ వంశీ రెడ్డి, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.