*వైసీపీ నేతలు దాడులు చేస్తుంటే..మేం గాంధీ మహాత్ములం కాదని గుర్తుంచుకోండి : సోమిరెడ్డి*

*అన్నపూర్ణ లాంటి ఏపీని పాత బీహార్ లా మార్చడం దుర్మార్గం*

*సర్వేపల్లి నియోజకవర్గంలో కిరాయి గూండాలతో టీడీపీ శ్రేణులపై దాడులు*

*దాడులను ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యేలు, మంత్రులు జూన్ 4 తర్వాత ఫలితం అనుభవించక తప్పదు*

*జన్మనిచ్చిన తల్లి, తోడబుట్టిన చెళ్లెళ్లే కాదు..కడప ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డిని తిరస్కరించారు*

*రాష్ట్రంలోని అనేక జిల్లాలో ఆయన సీట్ల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఎదురుకాబోతోంది*

*తెలుగుదేశం పార్టీ కూటమి 130కి పైగా సీట్లతో అధికారం చేపట్టబోతోంది*

*మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*

మే 13న ఎన్నికలు అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్య జరిగాయి

ఐదేళ్లలో అన్నపూర్ణ లాంటి ఏపీని జగన్మోహన్ రెడ్డి అరాచక ఆంధ్రప్రదేశ్ గా మార్చారు

చట్టాలను తన కాళ్ల కింద నలిపేశారు. ఐఏఎస్, ఐపీఎస్ లను కూలీలుగా మార్చుకున్నాడు

కీలకమైన వ్యవసాయ, ఇరిగేషన్, ఆర్ అండ్ బీ తదితర శాఖలకు ఏకంగా తాళం వేసేశాడు.

నిండు అసెంబ్లీలో ఎమ్మెల్యేలందరూ చర్చించి చేసిన తీర్మానాలను గౌరవించకుండా చెత్తబుట్టలో వేసేశాడు

చట్టసభల నిర్ణయాలకు, వ్యవస్థలకు విలువ లేకుండా చేసి ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టుగా పాలన సాగించాడు

రెండు, మూడు దశాబ్దాల క్రితం బీహార్ రాష్ట్రంలోని పరిస్థితులను ఏపీలో ఇప్పుడు చూపించాడు

దేశ వ్యాప్తంగా గతంలో ఏపీ అంటే ఎంతో గౌరవం ఉండేది. ఈ రోజు జాతీయ స్థాయిలో తలదించుకునే పరిస్థితి తెచ్చాడు

పోలింగ్ సరళిని గమనించిన తర్వాత వైసీపీ నేతల్లో ప్రస్టేషన్ పీక్ కి చేరింది. దాడులు, దుర్మార్గాలకు పాల్పడుతున్నారు

ఎన్నికల తర్వాత ఎప్పుడూ లేని విధంగా హింసకు దిగి సాక్షాత్తు సీఎస్, డీజీపీలను ఈసీ ఢిల్లీకి పిలిపించే పరిస్థితి తెచ్చారు

దేశంలోని ఏ రాష్ట్రం చరిత్రలో ఇలాంటి పరిస్థితి చోటుచేసుకోలేదు

వైసీపీ ఐదేళ్ల పాలనపై వ్యతిరేకత కట్టలు తెంచుకుంది.

ప్రజలకు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తి ఓట్లు వేయడాన్ని వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు

మహిళలు, వృద్ధులు, యువత ఓటు వేయడానికి వెల్లువలా వచ్చారంటే వారు ఏమి కోరుకుంటున్నారో స్పష్టంగా అర్థమవుతోంది

ఒక యువకుడు రాష్ట్రాలను, దేశాలను దాటుకుని ఓటుకు వస్తే అతని అమ్మానాన్నలను, అవ్వాతాతలను చైతన్యం చేయకుండా వదిలిపెడతాడా

జగన్మోహన్ రెడ్డిని మోయడంలో ఆయన షాడో టీవీలు సాక్షి ఛానల్ ను మించిపోయాయి. ఈసీ నిబంధనలకు కూడా తూట్లు పొడిచారు

ఆ షాడో ఛానల్ జగన్మోహన్ రెడ్డిపై చూపించింది ప్రేమనా…పేమెంటా

ఏపీ నుంచి ఢిల్లీ వరకు షాడ్ చానల్స్ కోసం ఎన్ని వేల కోట్లు తగలబెట్టారో లెక్కే లేదు

రాష్ట్రంలో దాడులు, దుర్మార్గాలు జరుగుతుంటే కూడా వక్రబాష్యాలు చెప్పడం విడ్డూరంగా ఉంది

పరిస్థితులు ఇలాగే కొనసాగితే జూన్ 4 తర్వాత రాష్ట్రంలో మహాత్మా గాంధీలు ఉన్నారనుకుంటున్నారా..ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపిస్తారనుకుంటున్నారా

మంత్రులు, ఎమ్మెల్యేలు దగ్గరుండి దాడులు చేయిస్తుంటే ఈ రాష్ట్రం ఎక్కడికి పోతోంది

20 రోజుల తర్వాత టీడీపీ నాయకులు, కార్యకర్తలను గ్రామాల్లో ఉండలేరని, బతకలేరని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వార్నింగ్ ఇస్తున్నాడు

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం సచ్చిందా..ఇలాంటి పరిస్థితులు రావడం దురదృష్టకరం

జూన్ 4 తర్వాత రాష్ట్రంలో 130 సీట్లతో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారం చేపట్టబోతోంది.

వైసీపీ కడపలోనే కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. డిప్యూటీ సీఎంను చూసి కాదని, తనను చూసి ఓటు వేయండని సీఎం ప్రాధేయపడిన పరిస్థితిని చూశాం

తోడబుట్టిన చెళ్లెళ్లు, జన్మనిచ్చిన తల్లి కూడా వ్యతిరేకంగా మారిన తర్వాత సామాన్య ప్రజలు జగన్మోహన్ రెడ్డిని నమ్మే పరిస్థితి లేకుండా పోయింది

కడప పార్లమెంటు పరిధిలో మెజార్టీ సీట్లను తెలుగుదేశం పార్టీ కూటమి కైవసం చేసుకోబోతోంది

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10కి 10 సీట్లు గెలవబోతున్నాం

ఇంకా అనేక జిల్లాలో సీట్లు వెతుక్కోవాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఎదురుకాబోతోంది

జూన్ 4 తర్వాత అధికారం చేపట్టి రాష్ట్రాన్ని బతికించుకోవడమే లక్ష్యంగా పనిచేస్తాం. దుర్మార్గుల చేతిలో నుంచి ఏపీని కాపాడుకోవడానికి, గాడి తప్పిన రాష్ట్రాన్ని సక్రమ మార్గంలో నడిపేందుకు కృషి చేస్తాం

నలభై ఏళ్లుగా రాజకీయాలు చూస్తున్నాం..చేస్తున్నాం…ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనలేదు

జగన్మోహన్ రెడ్డిలో కనీసం మానవత్వం కరువైంది. రాష్ట్రం అట్టుడికిపోతుంటే ప్యాలెస్ లో కూర్చుని ఎంజాయ్ చేస్తున్నాడు

సర్వేపల్లి నియోజకవర్గానికి వైసీపీ నేతలు బయట నుంచి గూండాలను దించి దాడులకు పాల్పడుతుంటే పోలీసులు చూస్తూ ఊరుకోవడం దురదృష్టకరం

ప్రతి నియోజకవర్గంలోనూ అదే పరిస్థితి. ప్రశాంతత లేకుండా చేశారు

ఎన్నికల ఫలితాలకు రోజులు దగ్గర పడుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు వళ్లు దగ్గరపెట్టుకుని ఉండండి

మేం గాంధీ మహాత్ములం కాదని గుర్తుంచుకోండి

ఇప్పటికైనా కంట్రోల్ లో ఉండకపోతే జూన్ 4 తర్వాత అనుభవించక తప్పదు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *