
*SPS నెల్లూరు జిల్లా*
*వేదాయపాలెం, నెల్లూరు రూరల్, పొదలకూరు మరియు రాపూరు పోలీసు స్టేషన్ లను సందర్శించిన గుంటూరు రేంజ్ ఐజి శ్రీ సర్వ శ్రేష్ట త్రిపాఠి,IPS.,*
వేదాయపాలెం, నెల్లూరు రూరల్, పొదలకూరు మరియు రాపూరు పోలీస్ స్టేషన్ ను గుంటూరు రేంజ్ ఐజి గారు, జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల,IPS., గారితో పాటు కలిసి సందర్శించడం జరిగినది.
పోలీసు స్టేషన్ ల మ్యాప్ లను పరిశీలిస్తూ, స్టేషన్స్ పరిధిలో ఉన్న పరిస్థితులు, నేర ప్రాంతాలపై ఆరా..
పోలీస్ స్టేషన్ లో ఉన్న పెండింగ్ కేసులు, క్రైమ్ రికార్డుల పరిశీలించిన ఐ.జి. గారు.
జిల్లాలో నేరాల నిర్మూలన, శాంతి భద్రతల పరిరక్షణ కోసం కట్టుదిట్టమైన చర్యలు తప్పనిసరి.
పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదుదారులతో స్వయంగా IG గారు మాట్లాడి, వారి సమస్యను తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదుదారిని మర్యాదపూర్వకంగా పలకరించి, వారి సమస్యలను ఓపిగ్గా విని, పరిష్కరించాలని ఆదేశించారు.
జిల్లాలో ఉన్న రౌడీ షీటర్స్, సస్పెక్ట్ షీటర్స్, ల్యాండ్ గ్రాబర్స్‌పై నిరంతరం నిఘా ఉంచాలి. వారి కదలికలపై ఇంటెలిజెన్స్ సేకరించి, లా అండ్ ఆర్డర్‌కు హాని కలిగించే ప్రయత్నాలు ఉంటే వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు.
గాంజా సేవించే వారు, అమ్మే వారిపై కఠినంగా కేసులు నమోదు చేసి నెట్‌వర్క్‌ను పూర్తిగా డిస్మాంటిల్ చేయాలి.
జిల్లా వ్యాప్తంగా ఉన్న బ్లాక్ స్పాట్ లను గురించి, రోడ్డు భద్రత నియమాల గురించి వాహనదారులతో పాటు పట్టణ, గ్రామ ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశాలు.
అన్ని పెండింగ్ కేసులను ప్రాధాన్యత క్రమంలో తీసుకుని త్వరితగతిన పూర్తి చేయాలి.
ముఖ్యంగా గ్రేవ్ క్రైమ్స్, ప్రాపర్టీ ఆఫెన్స్ కేసులపై వేగవంతంగా విచారణ జరపాలని ఆదేశించారు.
దొంగతనం కేసుల్లో కోల్పోయిన సొత్తును త్వరగా రికవరీ చేసి బాధితులకు తిరిగి అందించాలి. రికవరీ రేటు పెరగాలి, దొంగల గ్యాంగ్స్‌పై ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగించాలి.
సోషల్ మీడియా ద్వారా మహిళలను, వ్యాపారులను, సెలబ్రిటీలను బ్లాక్మెయిల్ చేసే వారిపై ప్రత్యేక నిఘా పెట్టాలి. తగిన చర్యలు తీసుకోవాలి.
పోలీసు సిబ్బంది సంక్షేమమే ప్రధమ కర్తవ్యం… పోలీస్ స్టేషన్ సిబ్బంది యొక్క యోగ క్షేమాలు అడిగి, ఏమైనా సమస్యలు ఉన్నాయా? వారి యొక్క గ్రీవెన్స్ ను అడిగి, వెంటనే పరిష్కరించేలా ఆదేశాలు..
ఈ తనిఖీలో IG గారితో పాటు జిల్లా యస్.పి. గారు, సంబంధిత CI, SI గార్లు, సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా పోలీసు కార్యాలయం, తేది.09.12.2025.