
*వీధుల్లో సంచరించే శునకాలను నియంత్రించే క్రమంలో భాగంగా శుక్రవారం ప్రత్యేక డ్రైవ్ : వెటర్నరీ వైద్యులు డాక్టర్ మదన్మోహన్*
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ ఆదేశాల మేరకు వెటర్నరీ వైద్యులు డాక్టర్ మదన్మోహన్ నేతృత్వంలో వీధుల్లో సంచరించే శునకాలను నియంత్రించే క్రమంలో భాగంగా శుక్రవారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.
స్థానిక మనుమసిద్ధి నగర్, ములుముడి బస్టాండ్, ఎమ్.జి.బి మాల్, నక్కల గుంట ప్రాంతాలలో స్పెషల్ డ్రైవ్ ద్వారా 15 వీధి శునకాలను పట్టుకుని స్థానిక పాత మున్సిపల్ కార్యాలయంలోని ఎబిసి సెంటర్ కు తరలించారు.
అదేవిధంగా నగర పరిధిలోని 3, 4 డివిజన్ లలో ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్న 25 కోతులను పట్టుకుని స్థానిక బద్వేల్ అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు