*విపిఆర్‌ దంపతులను మర్యాదపూర్వకంగా కలిసిన జడ్పీ సీఈవో*

నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులను నూతన జడ్పీ సీఈవో శ్రీధర్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.

ఇటీవల ఆయనను జిల్లా పరిషత్‌కు కొత్త సీఈవోగా ప్రభుత్వం నియమించింది. ఈ నేపధ్యంలో సోమవారం నగరంలోని విపిఆర్‌ నివాసానికి వచ్చిన ఆయన.. విపిఆర్‌ దంపతులను కలిసి పుష్పగుచ్ఛం అందించి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిబద్ధతతో పనిచేస్తూ ప్రజలకు ప్రభుత్వ సేవలను సమర్థవంతంగా అందించాలని సూచించారు. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed