*విధినిర్వహణలో నిర్లక్ష్యాన్ని సహించబోం*
*అమాయకులైన గిరిజనుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందే*
*సచివాలయ ఉద్యోగులకు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సూచన*
*ముత్తుకూరు మండలంలోని సచివాలయ ఉద్యోగులతో ఫిషరీ కాలేజ్ ఆడిటోరియంలో సమీక్ష నిర్వహించిన సోమిరెడ్డి*
ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందేందుకు కనీస అవసరమైన ఆధార్ కార్డులు లేని స్థితిలో గిరిజనులు ఉండటం బాధాకరం
ఒక్కో సచివాలయంలో 11 మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు..కనీసం పేదల అవసరాలు తెలుసుకోలేరా
అర్హత ఉన్నప్పటికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందలేకపోతున్న వారిని గుర్తించలేరా
సమాజంలో అత్యంత అమాయకులు, నిరక్షరాస్యులు అయిన గిరిజనులతో పాటు దళితులు, పేదలందరిపై సచివాలయ ఉద్యోగులు ప్రత్యేక దృష్టి పెట్టాలి
ఈ విషయమై తహసీల్దార్లు, ఎంపీడీఓలకు ఇప్పటికే స్పష్టమైన సూచనలు చేశాం
పేదలకు ఇళ్ల స్థలాల మంజూరుకు కూడా కృషి చేస్తున్నాం
జగనన్న కాలనీల పేరుతో గత ప్రభుత్వ హయాంలో అనేక అక్రమాలు జరిగాయి
పేదలకు నామమాత్రంగా కొన్ని ప్లాట్లు పంపిణీ చేసి ఎక్కువ శాతం వైసీపీ నేతల గుప్పెట్లో పెట్టుకున్నారు
పేదల ఇళ్ల నిర్మాణం కూడా అత్యంత నాసిరకంగా జరిగింది..
కాలనీల్లో స్థలాలు, పేదల ఇళ్ల నిర్మాణం అంశాలపైనా ప్రక్షాళన చేపట్టాం
ఇకపై పేదలకు 18 అంకణాల ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది
అనర్హుల గుప్పెట్లో ఉన్న స్థలాలను స్వాధీనం చేసుకుని న్యాయంగా, రాజకీయాలకు అతీతంగా పేదలకు పంపిణీ చేస్తాం
ఇళ్ల నిర్మాణంలో మొదటి ప్రాధాన్యతను గిరిజనులకే ఇస్తాం